Gujarat Polls : బీజేపీకి బహు దూరంలో కాంగ్రెస్
ABN, First Publish Date - 2022-12-08T08:29:07+05:30
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో డిసెంబరు 1, 5 తేదీల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో డిసెంబరు 1, 5 తేదీల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య దూరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. బీజేపీ 107 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుండగా, కాంగ్రెస్ కేవలం 25 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. ఆప్ కేవలం 1 స్థానంలో ముందంజలో ఉంది.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. బీజేపీ 16, కాంగ్రెస్ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆప్ ఖాతా తెరవలేదు.
ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Updated Date - 2022-12-08T08:29:11+05:30 IST