Eetala Comments: ఓటర్లను ప్రలోభపెట్టారు

ABN, First Publish Date - 2022-11-06T13:54:06+05:30

TS News: మునుగోడు (Munugodu) ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ (TRS) పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eetala Rajender) ఆరోపించారు. డబ్బు, మద్యంతో ఓటర్లను కొనేశారని విమర్శించారు.

Eetala Comments: ఓటర్లను ప్రలోభపెట్టారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TS News: మునుగోడు (Munugodu) ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ (TRS) పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eetala Rajender) ఆరోపించారు. డబ్బు, మద్యంతో ఓటర్లను కొనేశారని విమర్శించారు. నైతిక విజయం తమ పార్టీదేనని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ నాయకుల మీద రాళ్ల వర్షం కురిపించారు. దాడులు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. వందల కోట్ల రూపాయలు పోలీసు వాహనాల్లో తీసుకువచ్చి ప్రజలకు పంచిపెట్టారు. వందల లారీల లిక్కర్ తీసుకువచ్చి ప్రజలకు తాపించారు. మహిళా సంఘాలకు,  గొల్లకురుమలకు బ్యాంకులో డబ్బులు వేసారు. పింఛన్లు వేస్తామని ప్రలోభాలకు గురి చేశారు. స్వయంగా మంత్రులే టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే పింఛన్ రద్దు అయిపోతుంది అని బెదిరించారు. పాలన గాలికి వదిలిపెట్టి అందరూ మునుగోడులో తిష్ట వేశారు. ఇతర పార్టీల నాయకులను, బీజేపీ నాయకులను ప్రచారం చేయకుండా దౌర్జన్యం చేశారు. బీజేపీ పోలింగ్ ఏజెంట్లను ప్రలోభ పెట్టారు. సిబ్బందిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా ఎమ్మార్వో, ఎండీవోలతో ఫోన్లో మాట్లాడే స్థాయికి దిగజారారు. ప్రచారం అయిపోయాక అందరూ మునుగోడు నుంచి బయటికి వెళ్లాలని చెప్పి, కానీ ఒక్క టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులను మాత్రమే అక్కడ ఉంచారు. పలివెల గ్రామంలో నా భార్య వాళ్ల అమ్మ ఇంట్లో ఉంటే రాత్రి 11 గంటలకు బయటికి పంపించారు. అర్ధరాత్రి మహిళను ఎలా పంపిస్తారు? అని చెప్పినా కూడా వినకుండా బయటికి పంపించారు. టీఆర్ఎస్ వాళ్లను మాత్రం పోలింగ్ అయిపోయేవరకు ఉండనిచ్చారు. 

మునుగోడులో ధర్మమే గెలుస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుంది. కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు.’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-06T15:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising