ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode: రేపు సాయంత్రం 6 గంటలకు ప్రచారం బంద్.. 105 సమస్యాత్మక కేంద్రాలు

ABN, First Publish Date - 2022-10-31T18:05:20+05:30

రేపు (మంగళవారం) సా. 6 గంటలకు మునుగోడు (Munugode)లో ప్రచారం ముగుస్తోందని సీఈవో వికాస్‌రాజ్‌ (CEO Vikasraj) తెలిపారు.

Munugode
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: రేపు (మంగళవారం) సా. 6 గంటలకు మునుగోడు (Munugode)లో ప్రచారం ముగుస్తుందని సీఈవో వికాస్‌రాజ్‌ (CEO Vikasraj) తెలిపారు. మునుగోడు ఉపఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. 3వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో 2,41,855 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగంచుకోనున్నారని చెప్పారు. 45 స్థానాల్లో 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. నియోజకవర్గంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సహా 50 టీమ్‌లు రంగంలోకి దిగాయని వివరించారు. ఈసారి నియోజకవర్గంలో ఇన్‌కమ్ ట్యాక్స్‌ బృందాలు తిరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) వివరణ అందిందని వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వం రేపటితో ముగుస్తుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నియోజకవర్గంలో పార్టీల ప్రచారం పరిసమాప్తం కానుంది. గడిచిన కొన్ని రోజులుగా ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు వార్డుల్లో హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. మంత్రుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వరకు తమ అభ్యర్థుల తరపున ప్రచార బరిలో దిగి విజయం కోసం ఊరూరా తిరిగారు. పోలింగ్‌‌కు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో పార్టీలు ప్రలోభాలకు తెరతీస్తున్నాయి. పోలింగ్‌ గురువారం కావడంతో మిగిలిన ఉన్న తక్కువ సమయం నేపథ్యంలో ఓటర్లను తమవైపునకు ఆకర్షించేలా పార్టీలు ఎరలు వేస్తున్నాయి.

Updated Date - 2022-10-31T18:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising