ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MCD Election: ప్రచారం పాటను విడుదల చేసిన బీజేపీ

ABN, First Publish Date - 2022-11-15T18:56:38+05:30

ప్రతిష్ఠాత్మక ఎంసీడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం పాటను బీజేపీ మంగళవారంనాడు విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో కాలుష్యం, అవినీతిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఎంసీడీ ఎన్నికల్లో (MCD Elections) గెలుపే లక్ష్యంగా ప్రచారం పాటను (Campaign song) బీజేపీ మంగళవారంనాడు విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హయాంలో కాలుష్యం, అవినీతిని పాటలో ఎండగట్టింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు, కోవిడ్ సమయంలో బీజేపీ పాలిత కార్పొరేషన్లలో చేసిన సేవలను ఈ వీడియోలో హైలైట్ చేసింది. 'బీజేపీ కా మతలబ్ సేవా హై' (BJP means service) అంటూ సాగే ఈ పాటను ఎంపీ మనోజ్ తివారి ఆలపించారు. బీజేపీ అంటేనే సేవ అని చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించినట్టు వీడియో విడుదల కార్యక్రమంలో పార్టీ ఢిల్లీ యూనిట్ చీఫ్ ఆదేశ్ గుప్తా తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు ఆహారం, వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా వారిని ఏ విధంగా ఆదుకుందో ఇందులో వివరించినట్టు చెప్పారు. బీజేపీ హయాంలో మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పుడు ఏ విధంగా నివాస ప్రాంతాల్లో చెత్త ఏరివేసే పాయింట్లు ఏర్పాటు చేసి చెత్తను తొలగించడం జరిగేదో కూడా ఇందులో హైలైట్ చేసినట్టు చెప్పారు.

ఢిల్లీలో మెట్రో నెట్‌వర్క్ విస్తరణ, ప్రగతి మైదాన్ సమీపంలో సొరంగం నిర్మాణం వంటి అభివృద్ధి పనులను మోదీ చేపట్టడాన్ని కూడా పాటలో హైలైట్ చేశారు. ఇదే పాటలో యుమునా నదిని మురుగు కాలువగా, ఢిల్లీని గ్యాస్ ఛాంబర్‌గా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మార్చిందంటూ విమర్శలు సైతం గుప్పించింది.

ఇది నా 5,025వ పాట...

ఢిల్లీ పరిస్థితిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాట తనకు 5,025వ పాట అని భోజ్‌పురి నటుడు, గాయకుడు తివారీ తెలిపారు. కాగా, 250 వార్డుల్లో 200 సీట్లను గెలుచుకునేందుకు బీజేపీ ప్రచార పాట ఉపకరిస్తుందని ఢిల్లీ అసెంబ్లలో ప్రతిపక్ష నేత రామ్‌వీర్ సింగ్ బిదూరి తెలిపారు.

Updated Date - 2022-11-15T18:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising