Munugodu by poll: టీఆర్ఎస్ అభ్యర్థితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న హరీష్‌రావు
ABN, First Publish Date - 2022-11-01T14:05:33+05:30
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తో కలిసి మంత్రి హరీష్‌రావు రోడ్‌షోలో పాల్గొన్నారు.
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికల (Munugodu by poll) ప్రచారంలో భాగంగా నాంపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి (Prabhakar reddy)తో కలిసి మంత్రి హరీష్‌రావు (Harish rao) రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలు అన్నం పెట్టే వారు ఎవరో.... సున్నం పెట్టేవారో ఎవరో ఆలోచన చేయాలన్నారు. మన కష్టాలు తీర్చింది టీఆర్ఎస్.. ఇంటింటికి నీళ్లు ఇచ్చినట్టే.. సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో నాలుగు రూపాయల పని చేయని రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) ఏడాదిలో పనిచేస్తారని ఎలా నమ్ముతున్నారని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇవ్వండి మర్రిగూడెంలో మహిళా భవనాన్ని నిర్మాణం చేపిస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుండి రూ.1200 ధర పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడానికి రాజ్‌గోపాల్ (BJP candidate)కు తీరిక దొరకకపోతే ఆ చెక్కులను మంత్రి జగదీష్ రెడ్డి (Minister jagadish reddy) వచ్చి పంచారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ (TRS party)కి గెలుపు ఖాయమని... అందుకే బీజేపీ(BJP) నడ్డా (JP Nadda) మీటింగ్‌ను క్యాన్సల్ చేసుకున్నారని మంత్రి హరీష్ రావు (Telangana minister) వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-11-01T14:08:51+05:30 IST