ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode Election Results Live: ముగిసిన మునుగోడు కౌంటింగ్.. టీఆర్‌ఎస్ ఘన విజయం.. ఫైనల్ మెజారిటీ ఎంతంటే..

ABN, First Publish Date - 2022-11-05T19:00:43+05:30

ముగిసిన మునుగోడు కౌంటింగ్.. 10వేలకు పైగా మెజారిటీతో టీఆర్‌ఎస్ ఘన విజయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Munugode Results Live: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు

06:02 pm: మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలకు పోలైన ఓట్ల లెక్క ఇది..

టీఆర్‌ఎస్- 97,006

బీజేపీ- 86,697

కాంగ్రెస్-23,906

06:00 pm: కేసీఆర్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన గ్రామం లెంకలపల్లిలో టీఆర్‌ఎస్‌కు 254 ఓట్ల మెజారిటీ

05:50 pm: 15వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు 1270, బీజేపీ 1358. 15వ రౌండ్‌లో 88 ఓట్ల ఆధిక్యాన్ని కనబర్చిన బీజేపీ

* మొత్తం కౌంటింగ్ ముగిసే సరికి టీఆరెఎస్ 10297 ఓట్ల మెజార్టీ తో విజయం

* పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్ మెజారిటీ 194

05:20 pm: ముగిసిన మునుగోడు కౌంటింగ్.. 10,297 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం

05:10 pm: 14వ రౌండ్ ముగిసేసరికి 10094 ఓట్ల ఆధిక్యంతో 10వేల మెజారిటీని దాటిన టీఆర్‌ఎస్. బీఆర్‌ఎస్ సాధించిన తొలి విజయంగా టీఆర్‌ఎస్ శ్రేణుల సంబరాలు

05:05 pm: 14వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి.. 10వేల మెజారిటీని క్రాస్ చేసే దిశగా టీఆర్‌ఎస్

04:30 pm: 13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6691 ఓట్లు, బీజేపీకి 5406. 13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం 1285.

* 13 రౌండ్లు ముగిసేసరికి 9,136 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్

04:15: మునుగోడు ఉప ఎన్నికలో హస్తం పార్టీకి ఓటర్ల మొండిచెయ్యి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డికి డిపాజిట్ గల్లంతు

04:00 pm: ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డబ్బూ, మద్యం ఏరులై పారించారని టీఆర్ఎస్‌పై విమర్శ. ఒక్కడిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారని ఎద్దేవా

03:55 pm: 12వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 7440, బీజేపీ 5398. 12వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం 2042

* 12 రౌండ్లు ముగిసేసరికి 7836 ఓట్ల ఆధిక్యంతో గెలుపు వాకిట్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

03:43 pm: మునుగోడులో గెలుపు ఖాయం కావడంతో టీఆర్‌ఎస్ భవన్‌లో గులాబీ శ్రేణుల సంబరాలు

03:37 pm: 11వ రౌండ్ తర్వాత 5800 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్.. మునుగోడుపై ఆశలు వదులుకున్న బీజేపీ

03:05 pm: 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ భారీ ఆధిక్యం.. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 7,235, బీజేపీకి 5,877 ఓట్లు

03:00 pm: 10వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 7503, బీజేపీ 7015, కాంగ్రెస్ 1,347. 10వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 484 ఓట్ల ఆధిక్యం

* 10 రౌండ్లు ముగిసే సరికి 4416 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్‌

02:34 pm: మొదలైన పదో రౌండ్ కౌంటింగ్

02:18pm: 9వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు 7497, బీజేపీ 6665. 9వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ లీడ్ 832

* తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి 3923 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్

02:05 pm: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్త గారి గ్రామం పలివెలలో 400 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యం. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇదే గ్రామానికి ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

01:50 pm: 8వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు 6624, బీజేపీ 6088, ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 536 ఓట్ల ఆధిక్యం

* ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్ ఆధిక్యం 3091 ఓట్లు

01:45 pm: ప్రారంభమైన ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు

01:44 pm: ఏడవ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం 386 ఓట్లు

01:20 pm: ఏడవ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ దూకుడు.. ఏడవ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు- 7189, బీజేపీ- 6803, కాంగ్రెస్-1664 (పోస్టల్ ఓట్లతో కలిపి).

* ఏడు రౌండ్లు ముగిసేసరికి 2555 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

01:00 pm: ఏడవ రౌండ్‌లో మునుగోడు మండల ఓట్లు లెక్కింపు

12:50 pm: ప్రారంభమైన 7వ రౌండ్ కౌంటింగ్

12:44 pm: ఆరవ రౌండ్‎ ముగిసేసరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్‎కు 6,016, బీజేపీ 5,378 ఓట్లు వచ్చాయి.1, 4, 5, 6 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా..2,3 రౌండ్లలో బీజేపీ లీడ్‎లో ఉంది.

12:35 pm: ఆరవ రౌండ్‎లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 1, 4, 5 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. 2, 3 రౌండ్లలో బీజేపీ లీడ్‎లో ఉంది.

12:31 pm: ఆరవ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం..

12:10pm: బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కామెంట్స్..

* మునుగోడు ఎన్నికల ఫలితాలపై గందరగోళం తగదన్న లక్ష్మణ్

* ముఖ్యమంత్రి కార్యాలయం కన్నుసన్నల్లో కౌంటింగ్ జరుగుతోందని ఆరోపణలు

* టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగని మునుగోడు ప్రజలకు హ్యాట్సాప్

* ఐదో రౌండ్ ముగిసేవరకు నైతిక విజయం బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డిదే

* మునుగోడులో అంతిమ విజయం బీజేపీదే

12:17 pm: నాల్గవ రౌండ్ రీకౌంటింగ్‎కు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్

12:10pm: సీఈవో వికాస్‌రాజ్ వికాస్‌రాజ్ కామెంట్స్...

* ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోంది..

* అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందుకే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం

* ప్రతీ టేబుల్ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారు..కౌంటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేదు

* ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తున్నాం

11:58 am: ప్రారంభమైన ఆరో రౌండ్ కౌంటింగ్

11:55 am: 5వ రౌండ్‎లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ 6,162, బీజేపి 5,245 ఓట్లు రాగా, ఐదవ రౌండ్ లో టీఆర్ఎస్ 917 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

*ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 1,430 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది.

11:49 am: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యం పైన టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం

*రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

*కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలి.

*ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్

11:38 am: సీఈవో వైఖరి అనుమానాస్పదంగా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

*టీఆర్‌ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయని సీఈవో

*బీజేపీ లీడ్‌ వచ్చినా ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదు.

*అప్‌డేట్‌ చేయడంలో జాప్యంపై సీఈవో కారణాలు చెప్పాలి.

*మీడియా నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తే తప్ప ఫలితాలను వెల్లడించడం లేదు.

*ఫలితాల్లో ఏ మాత్రం పొరపాటు జరిగినా సీఈసీకి ఫిర్యాదు చేస్తాం.

11:30 am: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

*రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‎కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్

*రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం

*ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించిన కిషన్ రెడ్డి

*కిషన్ రెడ్డి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్‎లోడ్

11:27 am: మునుగోడు ఓట్ల లెక్కింపు.. రౌండ్ల వారీగా..

తొలి రౌండ్:

టీఆర్‌ఎస్- 6418

బీజేపీ- 5126

కాంగ్రెస్-2100

* తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం: 1292 ఓట్లు

రెండో రౌండ్:

టీఆర్‌ఎస్- 7781

బీజేపీ- 8622

కాంగ్రెస్-1537

* రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం: 841 ఓట్లు

మూడో రౌండ్:

టీఆర్‌ఎస్- 7390

బీజేపీ- 7426

కాంగ్రెస్-1926

* మూడో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం: 36

నాలుగో రౌండ్:

టీఆర్‌ఎస్- 4854

బీజేపీ- 4555

కాంగ్రెస్-1817

* నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం: 299

11: 22 am: ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

* సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు

*మంత్రులు పనిచేసిన స్థానాల్లో టీఆర్‌ఎస్ ఓడిపోయింది

* కూసుకుంట్ల స్వగ్రామంలో కూడా ఆయన ఓడిపోయారు

* సర్వే సంస్థలకు అందని విధంగా తీర్పు రాబోతుంది

*మునుగోడులో బీజేపీ గెలవబోతుంది

* ముమ్మటికీ ఓడిపోయేది కేసీఆర్ అహంకారమే

11:11 am: మునుగోడు ఉపఎన్నికలో కేఏ పాల్ -174, రోడ్డు రోలర్ -335, చపాతీ రోలర్-483, నోటా- 142 ఓట్లు పడ్డాయి.

11:05 am: 5వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 1,631 ఓట్ల లీడ్‎తో కొనసాగుతోంది.

10:58 am: మొత్తం నాలుగు రౌండ్లు ముగిసేసరికి 714 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

10:40 am: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు

* చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదు

* ఇప్పటివరకైతే టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది

* రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి

* చివరి వరకు హోరాహోరీ పోరు తప్పక పోవచ్చు

* బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉంది

10: 27 am: నాలుగు రౌండ్లు ముగిసేసరికి 613 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్. టీఆర్‌ఎస్ 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్ 8,200, బీఎస్పీ 907

10: 24 am: మొదలైన నారాయణ్‌పూర్ మండల కౌంటింగ్

10:25 am: నాల్గవ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 4,854 బీజేపి 4555, టీఆర్ఎస్ 299 ఓట్లతో లీడ్ లో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్ 334 ఓట్ల లీడ్.

10:20 am: 4 రౌండ్లతో ముగిసిన చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు. చౌటుప్పల్ మండలంలో మొత్తం పోలైన ఓట్లు 55,678. టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు 21,209, బీజేపీ 21,174, కాంగ్రెస్ 5,164

10:19 am: నిద్రపోతున్న తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని అప్డేట్ చేయటంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ వైఫల్యం. ఐదో రౌండ్ లెక్కింపు పూర్తయినప్పటికీ.. ‌ఇప్పటివరకూ ఒక్క రౌండ్ ఫలితాన్ని కూడా వెబ్‌సైట్‌లో అప్డేట్ చేయని ఎన్నికల కమిషన్

10: 15 am: మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గ్రామంలో బీజేపీ ఆధిక్యం

10:10 am: నాలుగో రౌండ్‌లో 1100 పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో బీజేపీ

09: 58 am: మూడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు 7010, బీజేపీ 7426, కాంగ్రెస్ 1532. బీజేపీ లీడ్ 416.

* మూడు రౌండ్లు ముగిసే సరికి 35 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్

09: 45 am: నాలుగో రౌండ్‌లోనూ ఆధిక్యం కనబరుస్తున్న బీజేపీ

09:44 am: మునుగోడులో హోరాహోరీ.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న గ్రామాల్లో బీజేపీ లీడ్

09: 40 am: తొలి రౌండ్‌లో కేఏ పాల్‌కు 34 ఓట్లు

09:37 am: మూడో రౌండ్లో బీజేపీకి 1000 పైగా ఆధిక్యం

09:36 am: మూడో రౌండ్‌లో బీజేపీకి ఆధిక్యం

09:35 am: విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ తీసుకున్న కేఏ పాల్.. కౌంటింగ్ కేంద్రానికి కేఏ పాల్

09:31 am: రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయంటే..

టీఆర్ఎస్: 14,211

బీజేపీ: 13648

కాంగ్రెస్: 3597

* రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 563 ఓట్ల ఆధిక్యం

09: 25 am: రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి (Munugode Telangana By Election Results 2022) 563 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్..

09:19 am: చౌటుప్పల్ మండలంలో (Munugode Bypoll Result 2022 Live Updates) లెక్కిస్తున్న రెండో రౌండ్‌లో 789 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ

09: 13 am: రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠ.. రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం..

08:58 am: తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 6478, బీజేపీ 5126, కాంగ్రెస్ 2100. టీఆర్‌ఎస్ లీడ్ 1352.

08:54 am: ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం. తొలి రౌండ్ చౌటుప్పల్ మండలంలో 1192 ఓట్లతో టీఆర్‌ఎస్ లీడ్

08:40 am: పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం.. టీఆర్‌ఎస్-228, బీజేపీ-224, బీఎస్పీ-10, ఇతరులు-88

08:36 am: నల్గొండ కౌంటింగ్ కేంద్రం వద్ద షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

08:35 am: అత్యధిక ఓటర్లు ఉన్న మండలం చౌటుప్పల్. చౌటుప్పల్‌లో మొత్తం పోలైన ఓట్లు 55,678

08:34 am: నోటిఫికేషన్‌ నాటికి చౌటుప్పల్‌ మునిసిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రాజగోపాల్‌రెడ్డికి ఆదరణ

08:33 am: చౌటుప్పల్ మండలంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పరిస్థితి

08:25 am: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్‌ఎస్ ముందంజ

08:23 am: అరగంటకు ఒక రౌండ్ ఫలితం.. ప్రతీ రౌండ్‌కు 15 వేల ఓట్ల లెక్కింపు

08:21 am: 1, 2, 3, 4 రౌండ్లలో చౌటుప్పల్ మండల ఓట్లు లెక్కింపు

08:20 am: తొలుత ఓట్ల లెక్కింపు మండలం- చౌటుప్పల్‌

08:15 am: మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. మునుగోడులో మొత్తం పోస్టల్‌ బ్యాలెట్లు- 686. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు..

08:00 am: మునుగోడు కౌంటింగ్ ప్రారంభం

07: 54 am: మునుగోడు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు- 298

07: 49 am: కౌంటింగ్‌ కేంద్రంలోని టేబుళ్ల సంఖ్య- 21

07:41 am: తొలి ఫలితం వెల్లడయ్యే పోలింగ్ బూత్- చౌటుప్పల్‌ మండలం జైకేసారం

07:40 am: తొలుత ఓట్ల లెక్కింపు మండలం- చౌటుప్పల్‌

07:39 am: మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

07:38 am: మునుగోడులో మొత్తం పోస్టల్‌ బ్యాలెట్లు- 686

07:35 am: ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు

07:30 am: మునుగోడు ఉప ఎన్నిక తొలి ఫలితం- ఉదయం 9 గంటలకు


తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా మారిన.. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక (Munugode Bypoll Result) ఫలితం వచ్చేసింది. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (TRS Kusukuntla Prabhakar Reddy) 10 వేల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం (TRS Won) సాధించారు. ఈ ఉప ఎన్నికకు కారణమైన, బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి (Palvai Sravanthi) డిపాజిట్ కోల్పోయారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మొత్తం 97006 ఓట్లు (96598+పోస్టల్ 405+సర్వీస్ 3) పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 86,697 ఓట్లు (86,485+పోస్టల్ 211+సర్వీస్ 1), కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 (23,864+పోస్టల్ 41+సర్వీస్ 1) ఓట్లు పోలయ్యాయి. మునుగోడులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,805. ఈ ఉప ఎన్నికలో 2,25,192 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 1,13,853 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 1,11,338 మంది మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ 686 పోలయ్యాయి.

మొత్తంగా చూసుకుంటే.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం (Munugode Election Results) అధికార టీఆర్‌ఎస్‌కు మంచి జోష్‌నివ్వగా, బీజేపీకి మరీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరాశ మిగిల్చింది. తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు పాట్లు పడుతున్న కాంగ్రెస్‌కు మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ గల్లంతవడం హస్తం పార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పక తప్పదు. ఒక పక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తూ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తుంటే.. అలాంటి సమయంలో.. అదీ రాహుల్ గాంధీ తెలంగాణలో ఉన్న సమయంలో మునుగోడు ఉప ఎన్నికలో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేసింది.

Updated Date - 2022-11-06T19:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising