Gujarat Polls : నవసరి బీజేపీ అభ్యర్థిపై దాడి... వాహనాలు ధ్వంసం...
ABN, First Publish Date - 2022-12-01T16:40:33+05:30
గుజరాత్ శాసన సభ (Gujarat Polls) ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ బుధవారం జరుగుతోంది.
గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ (Gujarat Polls) ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ బుధవారం జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే నవసరి బీజేపీ అభ్యర్థి పీయూష్ భాయ్ పటేల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన వాహన శ్రేణిలోని నాలుగైదు వాహనాలను ధ్వంసం చేశారు.
నవసరి (Navsari) పోలీసు సూపరింటెండెంట్ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, నవసరి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ (BJP) అభ్యర్థి పీయూష్ భాయ్ పటేల్ (Piyush Bhai Patel) ఓ ఫిర్యాదు చేశారు. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, నాలుగైదు వాహనాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఝరి గ్రామంలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 48.48 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రకటించింది. రాజ్‌కోట్ జిల్లా కలెక్టర్ అరుణ్ మహేశ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ తీరును వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదన్నారు.
Updated Date - 2022-12-01T17:04:20+05:30 IST