ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asaduddin Owaisi: మోదీ ఉద్యోగాల హామీపై జోకు పేల్చిన అసదుద్దీన్ ఒవైసీ

ABN, First Publish Date - 2022-11-24T20:59:54+05:30

గుజరాత్ ఎన్నికల (Gujarat Elections) ప్రచారంలో ఉన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల (Gujarat Elections) ప్రచారంలో ఉన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఓ ర్యాలీలో ప్రధానమంత్రి మోదీ 2 కోట్ల ఉద్యోగాల హామీపై జోక్ పేల్చారు. అసదుద్దీన్ మాట్లాడుతూ.. తానోసారి ఓ హోటల్‌లో ఓ యువకుడిని కలిశానని, అతడు తన జీవితం గురించి వివరించడానికి ఓ జోక్‌ను ఉపయోగించాడని ఒవైసీ గుర్తు చేసుకున్నారు. ఆ కుర్రాడు తనతో మాట్లాడుతూ.. తాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, కానీ ఆమె తన వద్దకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడొస్తుందని ప్రశ్నించిందని, ఇంట్లో ఇంకో సంబంధం వెతుకుతున్నారని ఆమె చెప్పినట్టు యువకుడు తనతో చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడని అసద్ పేర్కొన్నారు.

దీంతో యువకుడు బాధగా ‘మోదీ సర్కారు మీద నమ్మకం పెట్టుకోవద్దు. నువ్వెళ్లి పెళ్లి చేసుకో’ అని చెప్పి పంపినట్టు అతడు తనతో చెప్పాడని ఒవైసీ గుర్తు చేసుకున్నారు. 2014లో ఎన్నికల ప్రచారంలో మోదీ 2 కోట్ల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటికి 8 ఏళ్లు అయినా అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో 2024లో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పుడు దానిని 10 లక్షలకు తగ్గించారని మండిపడ్డారు.

ఎంఐఎం (AIMIM) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో పోటీ చేస్తోంది. నిరుద్యోగం, ఇటీవల జరిగిన మోర్బి బ్రిడ్జి కూలిన ఘటన వంటివాటిని ప్రస్తావిస్తూ ఓటు షేర్ రాబట్టేందుకు ఒవైసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం కూడా ఒవైసీ మోర్బీ బ్రిడ్జి ఘటనను ప్రస్తావిస్తూ అధికార పార్టీనే ఇందుకు బాధ్యత వహించాలని అన్నారు. గుజరాత్‌ను అభివృద్ధి చేశామని చెబుతున్న బీజేపీ.. మోర్బీ ఘటనలో 140 మంది చనిపోవడానికి కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఈ ఘటనకు కారణమైన కంపెనీ ధనవంతులను పట్టుకోలేదని, మోదీ సంపన్నులంటే ఎందుకంత ఇష్టమని ప్రశ్నించారు.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఓట్లను లెక్కిస్తారు. ఇక్కడ బీజేపీ 27 ఏళ్లుగా అధికారం చలాయిస్తోంది.

Updated Date - 2022-11-24T21:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising