ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Alzheimer’s disease: అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచే 5 అలవాట్లు ఇవే..

ABN, First Publish Date - 2022-11-08T12:04:39+05:30

మెదడును సోమరితనంగా మార్చడం వలన పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయి.

Alzheimer’s disease
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒత్తిడితో కూడిన రోజువారి జీవనశైలి ఉన్నవారు ఎవరైనా సరే నెమ్మదిగా అల్జీమర్స్ వ్యాధికి గురవుతారు. ఆధునిక జీవన శైలిలోని లోపాల కారణంగానే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రమాదంగా మారింది. ఒత్తిడితో మెదడు వ్యాధులకు గురిచేసే అలవాట్లు ఇవే..

1. మెదడును సోమరితనంగా మార్చడం వలన పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయి.

2. వ్యాయామం చేయకపోవడం కూడా అల్జీమర్స్ వ్యాధిని పెంచుతుంది.

3. చెక్కర ఉన్న అధిక కేలరీల ఆహారాన్ని అతిగా తీసుకోవడం మెదడు వాపు ప్రమాదాన్ని పెంచుతుంది.

4. ఆల్కహాల్, మాదకద్రవ్యాల వినియోగం మెదడు కణజాల నష్టానికి కారణం అవుతుంది. ఇది మెదడు వృద్ధాప్యానికి కారణం కావచ్చు.

5. అనారోగ్యకరమైన జీవనశైలి నుంచి అల్జీమర్స్ ప్రమాదాన్ని దాటాలంటే జీవన శైలిలో ఆరోగ్యకరమైన మార్పులు అవసరం.

అల్జీమర్స్ వ్యాధిని కలిగించే హానికరమైన అలవాట్లు

1. జీవనశైలి : శరీరానికి సరిపోని వ్యాయామంతో మెదడునెమ్మదిస్తుంది అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం కూడా వ్యాధులకు దోహదం కావచ్చు.

వ్యాయామం సరిగా ఉన్నట్టయితే అది మెదడును ఆరోగ్యంగా పదునుగా ఉంచుకోవడానికి అవసరమైన అనేక ప్రయోజనాలను అందిస్తుంది. హృదయ స్పందన రేటును పెంచి, ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

2.నిద్ర: నిద్ర లేకపోవడం పగటిపూట నిద్రమత్తుకు కారణమవుతుంది. ఏకాగ్రతను తగ్గించవచ్చు. ఎక్కువసేపు నిద్రపోకపోవడం వల్ల కూడా మెదడుకు హాని తప్పదట. మెదడులోని టౌ అనే ప్రోటీన్ స్థాయి పెరిగి అది అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది.

3. డీహైడ్రేషన్(Dehydration) : సాధారణంగా, మన శరీరం 70% నీటితో తయారైనందు వలన రోజుకు 8 గ్లాసుల నీరు త్రాగాల్సి ఉంటుంది. తగినంత నీరు త్రాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, ఇది డిమెన్షియా(Dementia)కు కారణమవుతుంది.

4. డ్రగ్స్, ఆల్కహాల్ వినియోగం: ఆల్కహాల్‌లో అతిగా తీసుకోవడం వల్ల మెదడుకు హాని కలిగవచ్చు. ఇది డిమెన్షియా (Dementia) ప్రమాదాన్ని పెంచుతుంది.

5. పోషకాలు లేని ఆహారం: చీజ్ బటర్ కేకులు, రెడ్ మీట్ మొదలైన అధిక కొవ్వులు తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి ప్రమాదాన్ని పెంచుతాయి. బదులుగా, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం మంచిది.

మెదడు కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు..

మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఈ క్రింది చిట్కాలను ప్రయత్నించాలి:

- ఆరోగ్యంగా తినండి.

- మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.

- అధిక పని నుండి విరామం తీసుకోండి.

- కుటుంబంతో గడపడానికి సమయాన్ని వెచ్చించండి

- వ్యాయామం, యోగా సాధన అవసరం.

- ఒత్తిడిని తగ్గించుకోవాలి

Updated Date - 2022-11-08T12:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising