ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

high protein, low carb diet : సమతుల్య ఆహారంతో బరువు ఈజీగా తగ్గచ్చు..

ABN, First Publish Date - 2022-11-08T13:09:30+05:30

పొద్దుతిరుగుడు విత్తనాలలోని యాంటీఆక్సిడెంట్‌లు మతిమరుపును తగ్గించడంలో సహాయపడతాయి.

high protein, low carb diet
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమతుల్య ఆహారంలో భాగంగా ప్రతి పోషకాన్ని తగిన నిష్పత్తిలో తీసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల ఇది బరువును తగ్గించడంలోనూ రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడంలోనూ సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించినట్లయితే ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా శరీరం గ్లూకోగాన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికోసం ఈ పదార్థాలు ట్రై చేయండి.

1. గ్రీక్ యోగర్ట్ (పాల నుంచి పాక్షికంగా తయారుచేసిన పెరుగు)

గ్రీక్ పెరుగు ప్రోటీన్ కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

2. పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యకరమైన పద్దతిలో బరువు తగ్గడానికి మంచిది. ఎందుకంటే అవి ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్, కాపర్‌తో సహా ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. వాటిని చిరుతిండిగా కూరగాయల పైన వాడుకోవచ్చు లేదంటే సలాడ్‌లు, క్రీమ్ మొదలైన వాటిలో వేసుకోవచ్చు. పొద్దుతిరుగుడు విత్తనాలలోని యాంటీఆక్సిడెంట్‌లు మతిమరుపును తగ్గించడంలో సహాయపడతాయి.

3. సాల్మన్ చేప.

సాల్మన్ చేప అత్యంత పోషకాలు కలిగిన ఆహారాలలో ఒకటి. ఇది పోషకాలతో నిండి ఉండటమే కాకుండా, అనేక రకాల వ్యాధులకు కొన్ని ప్రమాద కారకాలను కూడా తగ్గిస్తుంది. కేవలం రుచి విషయంలోనే కాకుండా ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, మంచి కొవ్వులు, ప్రొటీన్లు అన్నీ సాల్మన్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆకలిని తగ్గించడం ద్వారా, జీవక్రియను మార్పు చేసి పొత్తికడుపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్మన్‌లో 108 కేలరీలు, 0 గ్రాముల పిండి పదార్థాలు, 17 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి, ఇవి బరువును తగ్గించడంలో సహాయపడతాయి.

4. వేయించిన చిక్పీస్( శనగలు)

శనగలు అద్భుతమైన పోషకాలకు నిలయం. వీటిలో అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. దీనిని చిరుతిండిగా తీసుకోవచ్చు. అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు తీసుకోవడం వల్ల అందులో పోషకాలు ఎక్కువగా ఉండటమే కాకుండా, పోషకాలు విటమిన్‌లతో సహా చక్కని భోజనంగా కూడా మారతాయి.

Updated Date - 2022-11-08T13:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising