ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

COVID-19: చైనాలో కొత్త కేసులతో బీజింగ్‌లో పాక్షిక లాక్‌డౌన్

ABN, First Publish Date - 2022-11-19T18:14:15+05:30

బీజింగ్: చైనాలో కరోనా కేసులు సంఖ్య 25,000 దాటడంతో మరోసారి పరిస్థితి ఆందోళకరంగా మారుతోంది. ఒక్క బీజింగ్‌లోనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనా (China)లో కరోనా కేసుల (Covid-19) సంఖ్య 25,000 దాటడంతో మరోసారి పరిస్థితి ఆందోళకరంగా మారుతోంది. ఒక్క బీజింగ్‌ (Beijing)లోనే 500కు పైగా కేసులు నమోదు కావడంతో సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. వారాంతపు సెలవులు అయినందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, రోజువారీ టెస్టింగ్‌లు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో శనివారంనాడు బీజింగ్‌లో జనసంచారం తక్కువగా కనిపించింది. ఎక్కువ మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రాకపోకలు కుదించుకోవాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని పలు జిల్లాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

జనాభా అధికంగా ఉండే చవోయాంగ్ జిల్లాలో కేసులు గణనీయంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్ హబ్‌లు, వేలాది రెసిడెన్సియల్ కమ్యూనిటీలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరి అయితే కానీ ప్రజలు బయటకు వెళ్లవద్దని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే 48 గంటల్లోగా నెగిటివ్ వైరల్ డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకుని వాటిని సమర్పించాల్సి ఉంటుందని అధికారిక మీడియా శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

చవోయాంగ్‌‌తో పాటు డాంగ్‌చెంగ్, జీచెంగ్, టాంగ్‌జవో, యాంకింగ్, చాంగ్‌పింగ్, హైడియాన్ తదితర జిల్లాల్లో అధికారిక మీడియా అకౌంట్లలో అంతర్ జల్లా పర్యటనలను తగ్గించుకోవాలంటూ లేఖలు అప్‌లోడ్ చేశారు. పెరుగుతున్న కరోనా కేసులను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు బీజింగ్‌లోని కొన్ని ప్రధాన షాపింగ్ మాల్స్‌లో డైనింగ్-ఇన్-సర్వీస్‌ను రద్దు చేశారు.

Updated Date - 2022-11-19T18:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising