Imran Khan: నన్ను చంపేస్తారని నాకు ముందే తెలుసు
ABN, First Publish Date - 2022-11-04T20:35:47+05:30
లాహోర్: తనను చంపేస్తారని తనకు ముందే తెలుసని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
లాహోర్: తనను చంపేస్తారని తనకు ముందే తెలుసని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. తనపై పంజాబ్ లేదా, వజీరాబాద్‌లో దాడి జరుగుతుందని తనకు ముందే తెలుసన్నారు. తనను చంపే ఉద్దేశంతో నాలుగు బుల్లెట్లు తనపై కాల్చారని చెప్పారు. తనపై హత్యాయత్నం తర్వాత లాహోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తన పార్టీకి చెందిన ఎంపీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఇమ్రాన్ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తన ఎంపీలపై అవినీతి కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. ప్రజలు తనవైపే ఉన్నారని చెప్పారు. తనపై దాడికి పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, రాణా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ కారణమని ఇమ్రాన్ నిన్ననే ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల వల్ల ఎక్కువగా చప్పుడు వస్తోందని, తాను నమాజ్ చేసుకోలేకపోతున్నందుకే దాడి చేశానని నిందితుడు చెప్పాడు. ఇమ్రాన్‌పై పిస్టల్‌తో దాడి జరుపుతున్న సమయంలో పీటీఐ కార్యకర్త ఒకరు ప్రతిఘటించడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే దుండగుడి కాల్పుల్లో ఇమ్రాన్ ప్రాణాలు కోల్పోయి ఉండేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Updated Date - 2022-11-04T20:36:32+05:30 IST