Imran Khan: అసభ్య సంభాషణల ఆడియో లీక్..!
ABN, First Publish Date - 2022-12-21T16:26:04+05:30
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్టు... భావిస్తున్న రెండు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్టు భావిస్తున్న రెండు ఆడియో క్లిప్‌లు (Audio clips) తాజాగా బయటకు వచ్చాయి. ఈ క్లిప్‌లను సయీద్ అలీ హైదరీ అనే పాక్ జర్నలిస్టు యూట్యాబ్ ఛానెల్‌లో పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఆడియో క్లిప్‌లు వైరల్‌గా మారాయి. ఈ కాల్స్‌లో ఒక వ్యక్తి (ఇమ్రాన్ ఖాన్ స్వరంగా భావిస్తున్నారు) ఇద్దరు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతున్నట్టు ఉంది. పాక్ ప్రధాని కార్యాలయం నుంచి ఈ ఆడియో క్లిప్‌లు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇవి పూర్తిగా తప్పుడు ఆడియో క్లిప్‌లను, ఇమ్రాన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నమని పీటీఐ పార్టీ కొట్టివేసింది.
ఆడియా క్లిప్‌లలో పురుష స్వరంతో ఒక వ్యక్తి ఇద్దరు గుర్తుతెలియని మహిళలతో అసభ్య సంభాషణలు జరుపుతున్నట్టు ఉంది. ఒక ఆడియో క్లిప్‌లోని పురుషుడు ఒక మహిళను తన దగ్గరకు రమ్మని అడుగుతాడు. ఒళ్లునొప్పులతో బాధపడుతున్నందున మరుసటి రోజున వస్తానని ఆమె చెబుతుంది. దానికి ఆ పురుషుడు సమాధానమిస్తూ, ఏ విషయం తెలియజేస్తే తన భార్యాపిల్లల రాకను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తానని, మరుసటి రోజు ఫోన్ చేసి చెబుతానని అంటాడు.
వైరల్ కావడంతో...
ఇమ్రాన్ మాట్లాడినట్టు చెబుతున్న అసభ్య సంభాషణల ఆడియా క్లిప్‌లపై సోషల్ మీడియాలో ప్రతికూల, అనుకూల స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. కాల్ లీక్‌తో ఇమ్రాన్ ఖాన్ కాస్తా ఇమ్రాన్ హస్మీ అయ్యాడని ఒక పాత్రికేయురాలు కామెంట్ చేసింది. ఇక నుంచి రోల్ మోడల్ ముస్లిం లీడర్‌గా తనను తాను అభివర్ణించుకోవడం ఇమ్రాన్ మానుకోవాలని మరో జర్నలిస్టు వ్యాఖ్యానించారు. కాగా, మరికొందరు ఇది తప్పుడు ఆడియో క్లిప్ అని, అది ఆయన గొంతు కాదని కామెంట్ చేశారు. బీట్ రిపోర్టర్‌గా 2010 నుంచి 2016 వరకూ ఇమ్రాన్ తనకు తెలుసునని, ఆయన ప్రతి ప్రసంగం, ప్రెస్ కాన్ఫరెన్స్ తాను విన్నానని ఒక పాత్రికేయుడు చెప్పారు. ఆడియోలోని గొంతు ఇమ్రాన్‌ది కాదని, డబ్ చేసిన ఆడియో అని, ఇలాంటి చర్యలు సిగ్గుచేటని ఆయన చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ సైతం రాజకీయ ప్రత్యర్థులే ఈ తప్పుడు ఆడియోలను విడుదల చేసినట్టు తప్పుపట్టింది.
Updated Date - 2022-12-21T16:26:05+05:30 IST