ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan : ఇమ్రాన్ ఖాన్ వద్దనుకున్న వ్యక్తికి పాక్ సైన్యం నూతన అధిపతి పదవి

ABN, First Publish Date - 2022-11-24T14:48:09+05:30

పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిం మునీర్ (Lt Gen Asim Munir) ఆ

Lt Gen Asim Munir
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిం మునీర్ (Lt Gen Asim Munir) ఆ దేశ సైన్యం నూతన అధిపతిగా ఎంపికయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా (Qamar Javed Bajwa) స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. బజ్వా (61) నవంబరు 29న పదవీ విరమణ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన పదవీ కాలాన్ని మూడేళ్ళపాటు పొడిగించారు, మరోసారి పొడిగింపును కోరే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు.

లెఫ్టినెంట్ జనరల్ అసిం మునీర్‌ను పాకిస్థాన్ (Pakistan) ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి గతంలో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో ఇమ్రాన్ సన్నిహితుడిని నియమించుకుంది. ప్రస్తుత ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehabaz Sharif) నూతన ఆర్మీ చీఫ్‌గా అసింనే ఎంపిక చేశారు. లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (CJCSC) చైర్మన్‌గా ఎంపిక చేశారు. వీరిద్దరికీ ఫోర్ స్టార్ జనరల్స్‌గా పదోన్నతి కల్పించారు. రక్షణ దళాల్లో సీజేసీఎస్‌సీ అత్యున్నత స్థాయి అధికారం కల కమిటీ. అయితే దళాల కదలికలు, మోహరింపు, నియామకాలు, బదిలీలు వంటివాటికి సంబంధించిన అధికారాలు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) వద్ద ఉంటాయి. అందుకే సీఓఏఎస్‌ చాలా శక్తిమంతుడు.

ఈ నియామకాల గురించి పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ ట్వీట్ ద్వారా గురువారం తెలిపారు. నియామకాలకు సంబంధించిన ఫైలును పాకిస్థాన్ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీకి పంపినట్లు తెలిపారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మీడియాతో మాట్లాడుతూ, నియామకాలకు సంబంధించి దేశాధ్యక్షునికి సిఫారసు చేసినట్లు చెప్పారు. అల్వీ ఈ నియామకాలను వివాదాస్పదం చేయరని అశిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి సలహాను సమర్థిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

లెఫ్టినెంట్ జనరల్ అసిం మునీర్ పాకిస్థాన్ నిఘా, గూఢచర్య వ్యవస్థల్లో పని చేశారు. నేరుగా జనరల్ బజ్వాకు సబార్డినేట్‌గా పని చేశారు. ఆఫ్ఘనిస్థాన్, భారత్, చైనాలతో పాకిస్థాన్ సరిహద్దుల్లో పని చేశారు. ఆయన నవంబరు 27న పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే ఆర్మీ చీఫ్ పదవి వరించడంతో ఆయన ఆ పదవిలో మూడేళ్ళు కొనసాగవచ్చు.

Updated Date - 2022-11-24T14:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising