ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: పోలీసు శిక్షణా స్కూల్‌పై తీవ్రవాదుల దాడి

ABN, First Publish Date - 2022-11-13T17:37:18+05:30

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. పోలీసు శిక్షణా స్కూలుపై దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. పోలీసు శిక్షణా స్కూలు (police training school)పై దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. బైక్‌పై వచ్చిన తీవ్రవాదులు కేపీఆర్ ప్రావిన్‌లోని కోహట్ పోలీస్ ట్రైనింగ్ స్కూలుపై హ్యాండ్ గ్రనేడ్లు విరిసినట్టు సీనియర్ పోలీసులు అధికారి ఒకరు తెలిపారు. ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీసు బృందాలు గాలింపు చర్చలు చేపట్టి 50 మంది అనుమానితులను అదుపులోనికి తీసుకున్నారు. ఘటనా స్థలికి ప్రాంతీయ పోలీసు అధికారి కోహిట్ ఖసిం అలిఖాన్, డిల్లా పోలీసు అధికారి సైఫుల్లా ఖాన్ చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితులను అదుపులోకి తీసువాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆర్‌పీఓ ఆదేశాలు జారీ చేశారు.

పోలీసు స్టేషన్లు, ప్రభుత్వం సంస్థలపై తీవ్రవాదులు దాడి చేయడం పాకిస్థాన్‌లో పరిపాటి. గతవారంలో పాకిస్థాన్‌లోని సింధి ప్రావిన్స్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌పై 150 పైగా డెకాయిట్లు దాడి చేశారు. ఈ దాడిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంకు అధికారి సహా ఐదుగురు పోలీసులు మృతిచెందారు. గత నెలలో ఇదే తరహాలో సాయుధ దుండగులు సౌత్ వజరిస్థాన్‌లోని పోలీసుస్టేషన్‌పై దాడి చేయడంతో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని డేరా ఇశ్మాయిల్ ఖాన్ ఏరియాలో జరిగిన మరో ఘటనలో సాయుధ దుండగులు ఒక పోలీసు కానిస్టేబుల్‌ను కాల్చిచంపారు.

Updated Date - 2022-11-13T17:37:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising