Himchal pradesh Campaign: కాంగ్రెస్ హామీలను నమ్మేదెవరు?: అమిత్‌షా
ABN, First Publish Date - 2022-11-06T16:51:09+05:30
సిమ్లా: ఎన్నికలు దగ్గరకు వస్తేనే కాంగ్రెస్ నేతలు ఆయా రాష్ట్రాల్లో కనిపిస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా నగ్రోటాలో ఆదివారంనాడు జరిగిన బహిరంగ సభలో ఆమిత్‌షా మాట్లాడుతూ..
సిమ్లా: ఎన్నికలు దగ్గరకు వస్తేనే కాంగ్రెస్ నేతలు ఆయా రాష్ట్రాల్లో కనిపిస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా నగ్రోటాలో ఆదివారంనాడు జరిగిన బహిరంగ సభలో ఆమిత్‌షా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నేతలు కనిపిస్తారని అన్నారు. తాను ఇక్కడకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి జరుపుతున్న ఒక ర్యాలీని చూశానని, కాంగ్రెస్ ''పది హామీల'' బోర్డులు సభావేదక వద్ద దర్శనమిచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ వాగ్దానాలను ఎవరు నమ్ముతారని ఆయన ప్రశ్నించారు.
సోనియాగాంధీ-మన్మోహన్ ప్రభుత్వం పదేళ్లు పరిపాలించాయని, వారి పాలనలో రూ.12 లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆయన అమిత్‌షా వెల్లడించారు. ''ఇవాళ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తున్నారు. ఇక్కడి ప్రజలెవ్వరూ వారి హామీలు నమ్మరు'' అని అన్నారు. రాబోయే ఐదేళ్లో హిమాచల్ ప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వాగ్దానం చేశారు. 40 ఏళ్లుగా 'వన్ మ్యాన్ వన్ పెన్షన్' డిమాండ్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉందని, కాంగ్రెస్ ఆ పథకం అమలు చేయడం విఫలమైందని అన్నారు. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే ''ఒకే ర్యాంకు, ఒకే ఫెన్షన్'' స్కీమ్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో అమలు చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ కేవలం దేవభూమి మాత్రమే కాదని, ఎందరో వీరులను కన్న వీర్‌భూమి అని కొనియాడారు. మాతృభూమి రక్షణ కోసం తమ కుమారులను సరిహద్దులకు పంపుతున్న వీరమాతల భూమి అని అన్నారు.
Updated Date - 2022-11-06T16:51:10+05:30 IST