ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra: విజయవంతంగా 100 రోజులు పూర్తి

ABN, First Publish Date - 2022-12-16T13:56:44+05:30

భారతదేశ ఐక్యత పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక భారత్ జోడో యాత్ర..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతదేశ ఐక్యత పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ''భారత్ జోడో యాత్ర'' (Bharat Jodo Yatra) విజయవంతంగా సాగుతోంది. ఈ యాత్ర శుక్రవారానికి 100 రోజులు (100 Days) పూర్తి చేసుకుంది. మూడు నెలలకు పైగా సాగుతున్న ఈ యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. సమాజంలోని వివిధ వర్గాలను కలుసుకుంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గత సెప్టెంబర్ 7న రాహుల్ పాదయాత్ర మొదలైంది. 2024 కీలక సార్వత్రిక ఎన్నికలకు ముందు సరికొత్త రాహుల్‌ను ఆవిష్కరించే యాత్రగా దీనిని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను సంఘటిత పరుస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పొంపొందించేందుకు రాహుల్ యాత్ర ఉపకరిస్తుందని చెబుతున్నారు. 150 రోజుల పాటు 3,700 కిలోమీటర్ల మేర పాదయాత్రను ఉద్దేశించగా, ఇందులో 2,800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది.

పాదయాత్రలో కొన్ని కీలక ఘట్టాలు..

1.కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అక్టోబర్ 6న భారత్ జోడో యాత్రకు కొత్త ఉత్తేజం కలిగించారు. కర్ణాటకలోని మాండ్యలో జరిగిన పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. తల్లీకొడుకులు పాదయాత్రలో పాలుపంచుకున్న ఫోటోలతో కూడిన ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. సోనియాగాంధీకి షూ లేసు కడుతున్న రాహుల్ ఫోటో వైరల్ అయింది. ఈ ఏడాది కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం బహిరంగ కార్యక్రమంలో సోనియాగాంధీ పాల్గొనడం ఇదే మొదటిసారి.

2.బాలీవుడ్ నటి స్వర భాస్కర్ డిసెంబర్ 1న భారత్ జోడో యాత్రలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెల్లని కుర్తా ధరించి రాహుల్‌తో అడుగులు వేస్తూ ఫ్యాన్స్‌కు చేతులు ఊపుతూ ఆమె సందడి చేశారు. ఆ ఫోటను కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

3.నవంబర్ 16న భారత్ జోడో యాత్రలో ఇబ్బందికర పరిమాణం తలెత్తింది. మహారాష్ట్రలోని వాషింలో రాహుల్ తన ప్రసంగం పూర్తి చేసుకున్న అనంతరం జాతీయగీతలాపన జరగాల్సి ఉండగా, పొరపాటు వేరే గీతం మొదలు కావడంతో రాహుల్ ఆశ్చర్యానికి గురయ్యారు.

4.రాహుల్‌కు క్రీడలంటే చాలా ఇష్టం. నవంబర్ 5న ఆయన చౌటుకూరు‌లో పాదయాత్ర చేస్తూనే ఫుట్‌బాల్ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.

5. కేజీఎఫ్ చాప్టర్-2 కాపీరైట్ విషయంలో నవంబర్ 7న కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్ర ట్విటర్ అకౌంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెంగళూరు కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ అంశం పరిష్కారమైంది.

6.నవంబర్ 25న రాహుల్‌గాంధీ తన సోదరి, పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి మధ్యప్రదేశ్‌లోని నర్మదా ఘాట్ వద్ద హారతి నిర్వహించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్డ్ వాద్రా, వారి కుమారుడు రెహన్ సైతం మధ్యప్రదేశ్‌లో జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు.

7. ఒలంపిక్ మెడలిస్ట్ బాక్సర్, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ నవంబర్ 25న మధ్యప్రదేశ్‌లో జరిగిన పాదయాత్రలో పాల్గొని రాహుల్‌తో కలిసి సందడి చేశారు. హర్యానా స్టయిల్‌లో ఇద్దరూ సరదగా మీసాలు మెలేస్తూ కనిపించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

8.ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రంజన్ డిసెంబర్ 14న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇద్దరూ ముచ్చటించుకుంటూ పాదయాత్రలో ముందుకు సాగడం అందరి దృష్టిని ఆకట్టుకుంది.

9. వివాదాస్పద గాడ్‌మన్ కంప్యూటర్ బాబా డిసెంబర్ 3న మధ్యప్రదేశ్‌లో జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు. భూఆక్రమణ కేసులో నిందితుడైన వ్యక్తి రాహుల్ పాదయాత్రలో పాల్గొనడం ఏమిటంటూ బీజేపీ విమర్శలు చేసింది.

10.కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ రెండు రోజుల పాటు భారత్ జోడో యాత్రలో రాహుల్ కలిసి పాల్గొన్నారు. టుక్డే టుక్డే గ్యాంగ్ సభ్యుడితో రాహుల్ పాల్గొనడానికి బీజేపీ తప్పుపట్టింది.

వీటికితోడు, సామాన్య పౌరులు, వివిధ రంగాల ప్రముఖులు రాహుల్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పూజా భట్, రియాసేన్ వంటి బాలీవుడ్ నటులు, మాజీ నేవీ చీఫ్ ఎల్.రాందాస్, శివసేన నేత ఆదిత్య థాకరే, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే తదితర ప్రముఖలు ఈ యాత్రలో రాహుల్‌తో అడుగులు వేశారు. రాహుల్ పాదయాత్ర ఆ పార్టీలో కొత్త ఆశలు రేకెత్తిస్తుండగా, వచ్చే ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024లో జరుగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఏ మేరకు ఫలితాలు రాబట్టుతుందో చూడాల్సి ఉంది.

Updated Date - 2022-12-16T14:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising