ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Assembly Elections: కమలనాథులకు మళ్లీ పీఠం దక్కేనా?

ABN, First Publish Date - 2022-12-03T17:43:23+05:30

ఈ నెల 5న మొత్తం 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

Gujarat Assembly Elections
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థుల తరపున మెగా రోడ్ షోలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ తదితరులు ప్రచారం చేశారు. ఆప్ తరపున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ తదితరులు ప్రచారం నిర్వహించారు. 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ ఈ సారైనా అధికారంలోకి రావాలని కలలు కంటోంది. ఆప్ పంజాబ్ మాదిరి విజయం అందుకోవాలని తహతహలాడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై బీజేపీకి బెంగ ఉన్నా డబుల్ ఇంజిన్ సర్కారు ప్రాధాన్యతను ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేశారు. నిరుద్యోగం, వెనుకబాటుతనాన్ని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ఢిల్లీ తరహా ఉచిత విద్యుత్, నీరు, విద్య, వైద్యం అందిస్తామని ఆప్ నేతలు ప్రచారం చేశారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే సరికొత్త రికార్డు కాబోతోంది. కాంగ్రెస్, రెండో స్థానంలో ఉండొచ్చని, ఆప్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని ఒపీనియన్ పోల్స్‌ వెల్లడించాయి.

ఈ నెల 5న మొత్తం 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 14, 975 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,13,325 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడతలో కచ్‌-సౌరాష్ట్ర, దక్షిణ గు జరాత్‌ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 63 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రకటించింది. 2017లో జరిగిన మొదటి విడతలో 66.75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ దఫా దాని కంటే 6.54 శాతం తగ్గడం విశేషం. ఇది ఎవరి విజయావకాశాలను ప్రభావితం చేస్తుందోనని పార్టీల్లో ఆందోళన నెలకొంది.

గుజరాత్‌ ఉత్తర ప్రాంతం బీజేపీకి గట్టి సవాల్‌ విసురుతోంది. ఓబీసీల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ప్రాంతంలో బనస్కాంత, పటన్‌, మెహసానా, సబర్కాంత, ఆరావళి, గాంధీనగర్‌ జిల్లాల పరిధిలో 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నెల 5న పోలింగ్‌ జరగనుంది. గత రెండు దఫాలుగా ఇక్కడ కాంగ్రెస్‌దే పైచేయి. 2012, 17 ఎన్నికల్లో ఆ పార్టీ 17 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 2012లో 15 స్థానాల్లో గెలిచింది. 2017లో 14 మాత్రమే వచ్చాయి. బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి నేతల తిరుగుబాట్లు తలనొప్పిగా తయారయ్యాయి. ప్రధానంగా అంజనా చౌధురి సామాజిక వర్గం ఆ పార్టీపై ఆగ్రహంతో ఉంది. దీనికి ప్రధాన కారణం మాజీ హోంమంత్రి విపుల్‌ చౌధురిని అరెస్టు చేయడమే. 2005-16 నడుమ డెయిరీ చైర్మన్‌గా ఉన్నప్పుడు రూ.800 కోట్ల అవినీతి జరిగిందని ఏడేళ్ల తర్వాత ఆయనపై ఫిర్యాదు అందింది. దీంతో ఏసీబీ ఈ ఏడాది సెప్టెంబరు 15న ఆయన్ను అరెస్టు చేసింది. ఇంతవరకు ఆయనకు బెయిల్‌ రాలేదు. సొంత పార్టీ ప్రభుత్వమే విపుల్‌ను అరెస్టు చేయడాన్ని అంజనా చౌధురి సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఈ వర్గం ప్రజలు ఉత్తర గుజరాత్‌లో కనీసం 30 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు. 1,253 గ్రామాలకు చెందిన 2 లక్షల మంది ‘అర్బుద సేన’ పేరుతో గత నెలలో గాంధీనగర్‌లో చార్‌దా గ్రామంలో భారీ సభ పెట్టి తమ సత్తా చాటుకున్నారు. అర్బుద సేనను విపుల్‌ చౌధురే గత ఏడాది ఏర్పాటు చేశారు. ఇది రాజకీయేతర సంస్థ అయినా ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపుతుందని విపుల్‌ వర్గీయులు బీజేపీకి సహకరించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. విపుల్‌ సన్నిహితులు కొందరు ఆమ్‌ ఆద్మీ పార్టీ లో చేరాలని భావించారు. అయితే అవినీతి ఆరోపణలతో అరెస్టయిన విపుల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి కేజ్రీవాల్‌ జంకారు. పైగా ఉత్తర గుజరాత్‌లో ఆప్‌ ఉనికి పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందంటున్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ 11 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇవ్వగా, బీజేపీ ఆరుగురికే అవకాశం ఇచ్చింది. మిగతా స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దించింది. పాటీదార్‌, కోలీ సామాజిక వర్గాల ప్రాబల్యం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఓబీసీ నేత అల్పేశ్‌ ఠాకూర్‌కు గాంధీనగర్‌ దక్షిణ సీటును బీజేపీ కేటాయించింది. గత ఎన్నికల్లో ఆయన పటన్‌ జిల్లా రాధన్‌పూర్‌ నుంచి గెలిచారు. 2019లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసి ఉప ఎన్నికలో ఓడిపోయారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడతలో కచ్‌-సౌరాష్ట్ర, దక్షిణ గు జరాత్‌ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 63 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రకటించింది. 2017లో జరిగిన మొదటి విడతలో 66.75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ దఫా దాని కంటే 6.54 శాతం తగ్గడం విశేషం. ఇది ఎవరి విజయావకాశాలను ప్రభావితం చేస్తుందోనని పార్టీల్లో ఆందోళన నెలకొంది.

Updated Date - 2022-12-03T17:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising