ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bad air quality : కేంద్రం దిగి రావాలి : కేజ్రీవాల్

ABN, First Publish Date - 2022-11-04T12:20:53+05:30

వాయు కాలుష్యం సమస్య కేవలం ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని, దీని పరిష్కారానికి కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వాయు కాలుష్యం సమస్య కేవలం ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని, దీని పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) డిమాండ్ చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఇది పరస్పరం నిందలు మోపుకోవలసిన సమయం కాదని స్పష్టం చేశారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ (Bhagwant Mann)తో కలిసి కేజ్రీవాల్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) సమస్య కేవలం ఈ రాష్ట్రానికే పరిమితం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని, జోక్యం చేసుకోవాలన్నారు. ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం పంజాబ్‌కు కానీ, ఢిల్లీకి కానీ పరిమితమైన సమస్య కాదన్నారు. వాయు కాలుష్యంపై ఈ రెండు రాష్ట్రాలలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలను మాత్రమే నిందించరాదన్నారు. ఇది ఉత్తర భారత దేశ సమస్య అని చెప్పారు. నిందలు మోపే ఆటను ఇక ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో కాలుష్యానికి పంజాబ్ కూడా కారణమవుతోందని అంగీకరించారు. ఈ విషయంలో రైతులు ఏదో ఓ నిర్ణయం తీసుకునేలా చేయవచ్చునని చెప్పారు.

ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం బుధవారం కాస్త మెరుగుపడినప్పటికీ, శుక్రవారం మళ్లీ తీవ్ర స్థాయికి పెరిగింది. వరి దుబ్బులను కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రాథమికోన్నత, హయ్యర్ సెకండరీ పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని చెప్పారు. ఈ విషయంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుంది.

ఇదిలావుండగా, వాయు కాలుష్యం పెరగడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమేనని బీజేపీ దుయ్యబట్టింది. బీజేపీ నేత మనోజ్ తివారీ (Manoj Tiwari) శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి శత్రువు అని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలో పంట కోసిన తర్వాత మిగిలే ఆకులు, దుబ్బులను కాల్చడం 34 శాతం పెరిగిందన్నారు.

Updated Date - 2022-11-04T12:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising