ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Case: 5 టీవీ ఛానల్స్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. ఏయే ఛానళ్లు ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2022-11-21T18:02:57+05:30

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో 5 టీవీ ఛానల్స్‌కు ఢిల్లీ హైకోర్టు (delhi high court) నోటీసులిచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన నోటీసుల్లో రిపబ్లిక్ టీవీ, ఇండియాటుడే, జీ న్యూస్, టైమ్స్ నౌ, ఏఎన్‌ఐ ఛానల్స ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో 5 టీవీ ఛానల్స్‌కు ఢిల్లీ హైకోర్టు (delhi high court) నోటీసులిచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన నోటీసుల్లో రిపబ్లిక్ టీవీ, ఇండియాటుడే, జీ న్యూస్, టైమ్స్ నౌ, ఏఎన్‌ఐ ఛానల్స ఉన్నాయి. సీబీఐ, ఈడీ (CBI ED) అడగనివాటిని కూడా అడిగినట్లు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ఛానల్స్‌పై అభియోగం ఉంది. ఈ 5 ఛానెల్స్‌ వార్తా నివేదికలను పరిశీలించాలని NBDSAకి కోర్టు ఆదేశించింది. ప్రసారాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా.. అనే విషయాన్ని పరిశీలించి తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయ తెలిసిందే. మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఒకవేళ తనకు సమన్లు జారీ చేస్తే ఏం చేయాలన్న విషయంపై న్యాయనిపుణులతో కవిత చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి విచారిస్తుండడంతోపాటు మరికొందరికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి బీఎల్‌ సంతోష్‌ సహా పలువురికి నోటీసులిచ్చి విచారించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. మద్యం కుంభకోణం కేసులో ఈడీ మరింత దూకుడు పెంచవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కవితకు కూడా నోటీసులు ఇవ్వవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి భార్య, జెట్‌ సెట్‌ గో ఏవియేషన్‌ లిమిటెడ్‌ సీఈవో కనికా టెక్రివాల్‌ రెడ్డి ఆదివారం సాయంత్రం కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లి వచ్చారు. శనివారం కూడా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లడం తెలిసిందే. అయితే తన భర్తను సాయంత్రం వేళలో కలుసుకునేందుకు అనుమతించాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చినందునే ఆమె వెళ్లినట్లు చెబుతున్నారు.

Updated Date - 2022-11-21T18:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising