ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

OBC Reservaiton: కోర్టు తీర్పు చెప్పినా...యోగి నోట పాతపాట..!

ABN, First Publish Date - 2022-12-27T20:17:11+05:30

ఓబీసీ రిజర్వేషన్లతోనే ఉత్తరప్రదేశ్ పురపాలక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఓబీసీ రిజర్వేషన్లతోనే (OBC Reservation) ఉత్తరప్రదేశ్ పురపాలక సంస్థల ఎన్నికలకు (UP urban body elections) వెళ్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి సర్వే నిర్వహిస్తామని, సర్వే జరక్కుండా, రిజర్వేషన్ లేకుండా పురపాలక సంస్థల ఎన్నికలు జరగవని కుండబద్దలు కొట్టారు. అవసరమైతే హైకోర్టు లక్నో బెంచ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు.

ఇతర వెనుకబడిన వర్గాలకు (OBC) రిజర్వేషన్లు లేకుండానే యూపీ పురపాలక సంస్థల ఎన్నికలకు (UP urban body polls) వెళ్లాలంటూ అలహాబాద్ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లపై డిసెంబర్ 5న యోగి సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో యోగి తాజా వ్యాఖ్యలు చేశారు. అర్బన్ బాడీ ఎన్నికల కోసం యూపీ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుందని, ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఓబీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని ఒక ట్వీట్‌లో సీఎం తెలిపారు. డిసెంబర్ 5న యోగి సర్కార్ డ్రాఫ్ట్ ప్రకారం, అలీగఢ్, మధుర-బృందావన్, మీరట్, ప్రయాగ్‌రాజ్‌ మేయర్ సీట్లను ఓబీసీ అభ్యర్థులకు రిజర్వ్ చేసింది.‌ వీటిలో అలీగఢ్, మధుర-బృందావన్ మేయర్ పోస్టులను ఓబీసీ మహిళలకు రిజర్వ్ చేశారు. అదనంగా, 300 మున్సిపల్ కౌన్సిల్స్‌లో 54 చైర్‌పర్సన్ పోస్టులు ఓబీసీలకు రిజర్వ్ చేశారు. వీటిలో ఓబీసీ మహిళలకు 18 రిజర్వ్ చేశారు. 545 నగర పంచాయతీల చైర్‌పర్సన్ సీట్లలో ఓబీసీ మహిళలకు 49 సీట్లతో సహా మొత్తం 147 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.

Updated Date - 2022-12-27T20:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising