ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Data protection Bill : డేటాకు కట్టుదిట్టమైన భద్రత... రూ.500 కోట్లు జరిమానా ప్రతిపాదించిన బిల్లు...

ABN, First Publish Date - 2022-11-18T16:52:24+05:30

ముసాయిదా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, 2019 ప్రతిపాదనల ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినవారికి రూ.15 కోట్ల వరకు

Data Protection Bill
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వ్యక్తిగత సమాచారానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇది ఆమోదం పొంది, చట్టంగా మారితే, దీనిలోని నిబంధనలను ఉల్లంఘించేవారికి రూ.500 కోట్లు వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ముసాయిదా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, 2022ను శుక్రవారం ప్రజల ముందు ఉంచింది.

ముసాయిదా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, 2019 ప్రతిపాదనల ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినవారికి రూ.15 కోట్ల వరకు లేదా సంస్థ గ్లోబల్ టర్నోవర్‌కు నాలుగు రెట్లు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ బిల్లుకు బదులుగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, 2022 (Digital Personal Data Protection Bill, 2022)ను ప్రభుత్వం రూపొందించింది. డేటా కలెక్షన్, పర్సనల్ డేటా సేకరణ, ప్రాసెసింగ్; క్రాస్ బోర్డర్ డేటా ఫ్లోస్ వంటివాటికి సంబంధించిన నిబంధనలను ప్రతిపాదించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వ్యాపార సంస్థలు, వ్యక్తులపై భారీ జరిమానాలు విధించాలని ప్రతిపాదించింది.

ఈ బిల్లులోని నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలను నిర్వహించేందుకు డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ నిబంధనలను ఓ వ్యక్తి ఉల్లంఘించినట్లు దర్యాప్తు అనంతరం ఈ బోర్డు నిర్థరిస్తే, ఆ వ్యక్తి తన వాదనలను వినిపించేందుకు తగిన అవకాశాన్ని కల్పించాలని, ఆ వాదనలను విన్న తర్వాత ఈ బిల్లులోని ఒకటో షెడ్యూలులో నిర్దేశించిన విధంగా జరిమానాను విధించవచ్చునని పేర్కొంది. ప్రతి సందర్భంలోనూ రూ.500 కోట్లకు మించకుండా ఈ జరిమానాను విధించవచ్చునని పేర్కొంది.

చట్ట ప్రకారం డేటా ఓనర్ల పర్సనల్ డేటాను ప్రాసెస్ చేసే డేటా ఫిదుసియరీస్ (data fiduciaries-ట్రస్టీలు) ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, వారికి జరిమానా విధించేందుకు గ్రేడెడ్ పెనాల్టీస్ సిస్టమ్‌ను ఈ బిల్లు ప్రతిపాదించింది. డేటా ఫిదుసియరీ తరపున డేటాను ప్రాసెస్ చేసే సంస్థ (Data Processor)కు కూడా ఈ జరిమానాలు వర్తిస్తాయని తెలిపింది.

డేటా ఫిదుసియరీ లేదా డేటా ప్రాసెసర్ తన నియంత్రణలో ఉన్న లేదా తన స్వాధీనంలో ఉన్న పర్సనల్ డేటాను పరిరక్షించడంలో విఫలమైతే, రూ.250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చునని ఈ బిల్లు ప్రతిపాదించింది.

ఈ బిల్లుపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు గడువు డిసెంబరు 17.

Updated Date - 2022-11-18T16:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising