ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India and Google : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో భేటీపై జైశంకర్ ఆసక్తికర ట్వీట్

ABN, First Publish Date - 2022-12-20T15:25:11+05:30

టెక్ జెయింట్ గూగుల్ (Google) సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai)తో భేటీ వివరాలను విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్

S Jaishankar, Sundar Pichai
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : టెక్ జెయింట్ గూగుల్ (Google) సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai)తో భేటీ వివరాలను విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) ట్విటర్ వేదికగా తెలిపారు. సుందర్ పిచాయ్‌తో సమావేశమవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురూ అంతర్జాతీయ పరిణామాలు, డిజిటలైజేషన్ గురించి చర్చించారు.

జైశంకర్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశమవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారత దేశ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అంతర్జాతీయ వ్యూహాత్మక పరిణామాల గురించి చర్చించినట్లు తెలిపారు.

పిచాయ్ భారత దేశ పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలతో సమావేశమయ్యారు. ఇన్నోవేషన్, తదితర అంశాలపై మోదీతో చర్చించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారత దేశానికి వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చించారు.

ఈ సమావేశం అనంతరం పిచాయ్ ఇచ్చిన ట్వీట్‌లో మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీ నాయకత్వంలో అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు అమల్లోకి వస్తుండటం గొప్ప ప్రేరణనిస్తోందన్నారు. అందరికోసం పని చేసే ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు భారత దేశ జీ20 ప్రెసిడెన్సీకి సహకరిస్తామన్నారు. భారత దేశంతోగల బలమైన భాగస్వామ్యం కొనసాగాలని ఆకాంక్షించారు. జీ20 ప్రెసిడెన్సీని భారత దేశం డిసెంబరు 1న స్వీకరించింది. ఇది గొప్ప బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోంది.

మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, సుందర్ పిచాయ్‌తో సమావేశమై, ఇన్నోవేషన్, టెక్నాలజీ తదితర అనేక అంశాల గురించి చర్చించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచం మానవ సౌభాగ్యం, సుస్థిర అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం కోసం కృషిని కొనసాగించడం ముఖ్యమని తెలిపారు.

Updated Date - 2022-12-20T15:25:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising