ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Twitter : ఎలన్ మస్క్ మరో హెచ్చరిక

ABN, First Publish Date - 2022-11-11T11:30:24+05:30

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్విటర్ నూతన యజమాని, కంప్లయింట్ హాట్‌లైన్ ఆపరేటర్ ఎలన్ మస్క్ (Elon Musk) గురువారం

Elon Musk
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్విటర్ నూతన యజమాని, కంప్లయింట్ హాట్‌లైన్ ఆపరేటర్ ఎలన్ మస్క్ (Elon Musk) గురువారం ఓ హెచ్చరిక చేశారు. 44 బిలియన్ డాలర్లకు ఈ కంపెనీని చేజిక్కించుకున్న తర్వాత తొలిసారి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కంపెనీ దివాలా తీస్తుందనడాన్ని తాను తోసిపుచ్చలేనని చెప్పారు. యాజమాన్య బాధ్యతలను చేపట్టిన మరుక్షణం దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించిన ఆయనకు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలు తలనొప్పి తెప్పిస్తున్నాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, యోయెల్ రోత్ (Yoel Roth), రాబిన్ వీలర్ (Robin Wheeler) అనే ఇద్దరు ట్విటర్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు బుధవారం ఎలన్ మస్క్‌తో ట్విటర్ స్పేసెస్ చాట్‌లో మాట్లాడారు. ఆందోళనకు గురవుతున్న ప్రకటనకర్తలను సముదాయించేందుకు మస్క్ ప్రయత్నించారు. అయితే ఈ ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామాలు సమర్పించారు. ఈ పరిణామాల గురించి సన్నిహితంగా తెలిసిన వర్గాలు ఈ సమాచారాన్ని ఓ వార్తా సంస్థకు చెప్పాయి. అయితే ఈ కథనాలపై స్పందించాలని రోత్, వీలర్లను కోరినప్పటికీ వారు స్పందించలేదని తెలుస్తోంది.

సిబ్బందితో గురువారం నిర్వహించిన ఈ సమావేశానికి ముందస్తు ఏర్పాట్లేవీ జరగలేనట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు కేవలం ఒక గంట ముందు నోటీసు పంపించి, అప్పటికప్పుడు సమావేశంలో పాల్గొనాలని కోరినట్లు సమాచారం. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. అంతకుముందు ఉద్యోగులకు ట్విటర్ పంపిన ఈ-మెయిల్‌లో రిమోట్ వర్క్‌కు ముగింపు పలికినట్లు తెలిపింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, అందరూ కష్టపడి పని చేయాలని చెప్పింది.

అంతకుముందు ట్విటర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీయా కిస్నెర్ (Lea Kissner) ఇచ్చిన ట్వీట్‌లో, తాను తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ట్విటర్‌ను వదిలిపెట్టాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్విటర్‌లో అద్భుతమైన వ్యక్తులతో పని చేసే అవకాశం వచ్చిందన్నారు. ప్రైవసీ, సెక్యూరిటీ, ఐటీ టీమ్స్‌తో కలిసి చేసిన కృషి చాలా గర్వకారణమని తెలిపారు. తర్వాత ఏమిటనేదాని కోసం ఎదురు చూస్తున్నానన్నారు. @USENIXSecurity కోసం రివ్యూలతో ప్రారంభిస్తానని తెలిపారు.

చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియెన్ కియెరన్, చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్ మరియన్నే ఫోగర్టీ కూడా ట్విటర్‌‌కు రాజీనామా చేశారు.

Updated Date - 2022-11-11T11:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising