ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid Surge: మన రోగ నిరోధక శక్తిపై ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-12-21T12:24:23+05:30

చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు వస్తున్న వార్తలు అందరినీ కలవరపెడుతున్నాయి. అయితే భారతీయులు మరీ ఎక్కువగా

Dr Randeep Guleria
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు వస్తున్న వార్తలు అందరినీ కలవరపెడుతున్నాయి. అయితే భారతీయులు మరీ ఎక్కువగా ఆందోళనచెందవలసిన అవసరం లేదని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా (Randeep Guleria) భరోసా ఇచ్చారు. ఇటీవలే ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మేదాంత హాస్పిటల్ డైరెక్టర్ (వైద్య విద్య)గా కూడా వ్యవహరిస్తున్నారు.

డాక్టర్ గులేరియా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చైనా, ఇటలీలలో పరిణామాలను గుర్తించి, తక్కువగా సిద్ధమవడం కన్నా మితిమీరిన సన్నద్ధత మంచిదని తాము గతంలో భావించామని, దానివల్ల మేలు జరిగిందని చెప్పారు. శాస్త్రవేత్తలు, క్లినిషియన్స్, విధాన రూపకర్తల మధ్య సమన్వయం ఉండటం వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. గతంలో చాలా ముందుగానే అష్ట దిగ్బంధనం (Lockdown)ను విధించామని, దానివల్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి, తాము సిద్ధమవడానికి వీలయిందని చెప్పారు. అయితే అప్పట్లో అష్టదిగ్బంధనాలపై విమర్శలు వచ్చినప్పటికీ, వాటిని అమలు చేసినట్లు తెలిపారు. కోవిడ్ రోగులకు చికిత్స చేయడం కోసం పెద్ద ఎత్తున కృషి చేయడానికి అష్టదిగ్బంధనాలను విధించడం వల్ల అవకాశం కలిగిందని చెప్పారు. ఆ సమయంలో మౌలిక సదుపాయాలను తగిన విధంగా మార్చుకోవడానికి, పునర్నిర్మించడానికి, సిద్ధమవడానికి అవకాశం కలిగిందన్నారు. ఇది రోలర్ కోస్టర్ రైడ్ వంటిదని, అయినప్పటికీ, చాలా పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే, మనం చాలా గొప్ప పని చేయగలిగామని అన్నారు.

కోవిడ్ మహమ్మారి దాడి చేసినపుడు ఆ వైరస్‌ను నిరోధించగలిగే రోగ నిరోధక శక్తి మనకు ఉండేది కాదన్నారు. ఫలితంగా కొంతమంది వ్యక్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారి తీసిందన్నారు. కానీ ఇప్పుడు ఈ మహమ్మారి వచ్చి మూడేళ్ళు అవుతోందని, అత్యధిక స్థాయిలో సహజంగా ఇన్ఫెక్షన్‌కు గురైన పరిస్థితి నేడు ఉందని తెలిపారు. చాలా మంది చాలాసార్లు ఈ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారన్నారు. మరోవైపు టీకాకరణ (Vaccination) కూడా విస్తృత స్థాయిలో జరిగిందని తెలిపారు. ఈ వైరస్‌ను దీటుగా నిభాయించగలిగే స్థాయిలో మన రోగ నిరోధక శక్తి ఉందన్నారు. ఈ వైరస్ మనపై తీవ్రంగా దాడి చేసే అవకాశాన్ని మన రోగ నిరోధక శక్తి ఇవ్వబోదని చెప్పారు. గతంలో ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లు వచ్చాయని, గత ఏడాదిలో కేవలం ఒమిక్రాన్ నుంచి వచ్చిన సబ్ లైనేజెస్ మాత్రమే వస్తున్నాయని తెలిపారు. చాలా భయానకమైన ప్రత్యేకతగల కొత్త వేరియంట్ ఏదీ రాలేదని, అయినప్పటికీ మనం అప్రమత్తంగా ఉండటం అవసరమని వివరించారు. వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కాబట్టి గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. చైనాలో వైరస్ కాస్త ఎక్కువ నిలకడగా, మందగమనంతో ఉన్నట్లు కనిపిస్తోందని, అక్కడి మరణాల రేటు, ఆసుపత్రుల్లో రోగుల చేరిక పెరుగుదలను గమనిస్తూ ఉండాలని తెలిపారు.

Updated Date - 2022-12-21T12:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising