Go First Aircraft: ముంబయి-గోవా గో ఫస్ట్ విమానంలో సాంకేతిక లోపం
ABN, First Publish Date - 2022-12-15T06:43:41+05:30
గో ఫస్ట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గోవాకు బయలుదేరిన గో ఫస్ట్ విమానం సాంకేతిక లోపం కారణంగా ....
ముంబయి: గో ఫస్ట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గోవాకు బయలుదేరిన గో ఫస్ట్ విమానం సాంకేతిక లోపం కారణంగా ముంబయి విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని డీజీసీఏ అధికారులు చెప్పారు.(Mumbai-Goa flight)సాంకేతిక కారణాల(Technical Snag) వల్ల ముంబయి-గోవా విమానం మిడ్-ఎయిర్ టర్న్‌బ్యాక్‌ను(Returns) గో ఫస్ట్(Go First Flight) విమానయాన సంస్థ అధికార ప్రతినిధి ధృవీకరించారు.విమానంలో 182 మంది ప్రయాణికులు ఉన్నారని ప్రతినిధి చెప్పారు.వీటీ-డబ్ల్యూజీపీ ఆపరేటింగ్ జి8-371 ముంబయి-గోవా విమానం ఏవియానిక్స్ లోపం కారణంగా తిరిగి వచ్చిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ ప్రారంభించనున్నట్లు అధికారి తెలిపారు.
Updated Date - 2022-12-15T06:43:43+05:30 IST