ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat elections : గుజరాతీలు నా గురువులు... వారి ఆశీర్వాదాలు చాలా ముఖ్యం : మోదీ

ABN, First Publish Date - 2022-11-20T15:35:14+05:30

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విస్తృత స్థాయిలో

Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దడమే తమ పార్టీ లక్ష్యమని చెప్తున్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నారు. గుజరాతీలు, కచ్-కథియవాడ్ ప్రజలు తన గురువులని, వారి ఆశీర్వాదాలు తనకు కావాలని కోరుతున్నారు.

రాజ్‌కోట్ జిల్లా ధోరాజీలో ఆదివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, గుజరాత్ ప్రజలు తన గురువులని చెప్పారు. వారి ఆశీర్వాదాలు తనకు కావాలన్నారు. గుజరాత్ ప్రజలు, కచ్-కథియవాడ్ ప్రజలు తన గురువులని, వారు తనకు శిక్షణనిచ్చి, తనను అభివృద్ధి చేశారని చెప్పారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. ‘‘అందుకే మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం’’ అని చెప్పారు. రెండు దశాబ్దాలపాటు సమైక్యంగా కృషి చేసినందుకే బీజేపీ ప్రజల ఆశీర్వాదాలను పుష్కలంగా పొందుతోందని చెప్పారు. కచ్ ఎడారి పెద్ద సమస్యగా ఉండేదని, దానిని గుజరాత్ కమానుద్వారంగా అభివృద్ధి చేశామని చెప్పారు.

గుజరాత్‌లోని సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఆదివారం మాట్లాడతారు. అంతకుముందు ఆయన సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెరవల్ పట్టణంలో జరిగిన ప్రచార సభలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన గుజరాత్ పర్యటన శనివారం ప్రారంభమైంది.

గుజరాత్‌లో 182 శాసన సభ స్థానాలున్నాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి జరుగుతాయి.

Updated Date - 2022-11-20T15:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising