Gyanvapi case: శివలింగం రక్షణను పొడిగించిన సుప్రీంకోర్టు
ABN, First Publish Date - 2022-11-11T16:34:46+05:30
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో కనుగొన్న శివలింగానికి ఇస్తున్న రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు...
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) కాంప్లెక్స్‌లో కనుగొన్న శివలింగానికి ( Varanasi Shivlling) ఇస్తున్న రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ శివలింగానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కేసు వినేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
శివలింగం ఉంటున్న ఏరియాకు ప్రొటక్షన్ కొనసాగించాలని హిందూ వర్గాలు తమ పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరాయి. హిందూ భక్తుల తరఫున హాజరైన అడ్వకేట్ విష్ణు శంకర్ వాదనలను భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ గురువారం విచారించింది. శివలింగానికి సుప్రీంకోర్టు కల్పించిన రక్షణ ఈనెల 12వ తేదీతో ముగుస్తున్నందున, భధ్రతను పొడగించాలని విష్ణు శంకర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వీడియోగ్రఫీ సర్వేలో కనుగొన్న శివలింగం ఉంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని గత మే 17న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలిచ్చింది. జ్ఞానవాపి మసీదులో ముస్లింలు నమాజు చేసుకునేందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. కాగా, శివలింగం విషయంలో హిందూ వర్గాలు చేస్తున్న వాదనతో ముస్లిం వర్గాలు ఏకీభవించడం లేదు. సర్వేలో కనిపించినట్టు చెబుతున్న వస్తువు ఒక ఫౌంటేన్ అని ఆ వర్గాలు వాదిస్తున్నాయి.
Updated Date - 2022-11-11T17:02:49+05:30 IST