Himachal pradesh openion poll: 41 సీట్లతో బీజేపీకే తిరిగి అధికారం
ABN, First Publish Date - 2022-11-04T19:37:29+05:30
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్...
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ (Himachal pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (Bjp) 41 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ (openion poll) జోస్యం చెప్పింది. విపక్ష కాంగ్రెస్ (Congress) పార్టీ 25 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇండియా టీవీ -మాట్రిజ్ (India Tv-Matrize) ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 68 స్థానాలకు నవంబర్ 12న ఒకే విడతగా పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
ఓట్ల శాతం..
ఒపీనియన్ పోల్ ప్రకారం, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 46 శాతం ఓట్లు సాధించనుంది. రాష్ట్రంలో ప్రధాన విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ 42 శాతం ఓట్లు సొంతం చేసుకుంటుంది. రాష్ట్రంలో ఉనికి చాటుకోవాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ 2 శాతం వోట్లు సాధిస్తుంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 10 శాతం ఓట్లు గెలుచుకుంటారు.
సీట్ల షేర్...
సర్వే ప్రకారం, మొత్తం 68 సీట్లలో బీజేపీకి 41 సీట్లు, కాంగ్రెస్‌కు 25 సీట్లు వస్తాయి. ఆప్ ఖాతా తెరవదు. ఇతరులు 2 సీట్లు గెలుచుకుంటారు.
Updated Date - 2022-11-04T19:37:38+05:30 IST