ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Terrorists : ఉగ్రవాదులు కొత్త టెక్నాలజీ వాడటం ఆందోళనకరం : భారత్

ABN, First Publish Date - 2022-10-29T13:59:35+05:30

ఉగ్రవాద కార్యకలాపాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటం వల్ల పెను ముప్పు పొంచి ఉం

UNSC Counter Terrorism Committee
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉగ్రవాద కార్యకలాపాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటం వల్ల పెను ముప్పు పొంచి ఉందని భారత్ శనివారం హెచ్చరించింది. రకరకాల టెక్నాలజీలు నేడు చౌకగా, సిద్ధంగా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంది. ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించడానికి నూతన టెక్నాలజీలు దోహదపడుతున్నాయని, అదే సమయంలో పెను సవాళ్ళను కూడా విసురుతున్నాయని తెలిపింది.

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ సమావేశాలు శుక్రవారం నుంచి జరుగుతున్నాయి. ఐక్య రాజ్య సమితికి భారత దేశ శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్ శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశాల్లో మాట్లాడుతూ, నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించడానికి దోహదపడటంతోపాటు, అత్యవసరంగా దృష్టి సారించి, చర్యలు తీసుకోవలసిన చాలా సవాళ్ళను కూడా విసురుతున్నట్లు తెలిపారు. ఉగ్రవాద ప్రయోజనాల కోసం నూతన టెక్నాలజీలను ఉపయోగిస్తుండటం పెరుగుతోందన్నారు. వేర్వేరు టెక్నాలజీలు కారుచౌకగా, అందరికీ సిద్ధంగా అందుబాటులో ఉంటుండటం వల్ల ఉగ్రవాదులు వాటిని వాడుతున్నారని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరగడం వల్ల ఉగ్రవాదులు తమ విషపూరిత కథనాలను వ్యాపింపజేయడానికి అవకాశం చిక్కిందని తెలిపారు. వారు తమ ప్రచారానికి పదును పెట్టడానికి, మరీ ముఖ్యంగా యువత, బాలలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయడానికి అవకాశం దొరికిందన్నారు. గేమింట్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా ఉగ్రవాదులు వాడుకుంటున్నారన్నారు.

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) మాట్లాడుతూ, ఉగ్రవాదం ముప్పు పెరుగుతోందని, ఈ జాఢ్యాన్ని నివారించేందుకు రెండు దశాబ్దాల నుంచి ఐక్య రాజ్య సమితి చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నప్పటికీ, అది విస్తరిస్తోందన్నారు. ఈ టెక్నాలజీలు ప్రభుత్వాలకు, రెగ్యులేటరీ వ్యవస్థలకు నూతన సవాళ్లను విసురుతున్నాయన్నారు. ఉగ్రవాద నిరోధం లక్ష్యంగా ఆంక్షలను విధిస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ నిధులతో నడిచే వ్యవస్థగా మార్చిన దేశాలను ఎత్తి చూపేందుకు ఈ కృషి దోహదపడుతోందని చెప్పారు. ఇటువంటి కృషి జరుగుతున్నప్పటికీ ఉగ్రవాదం పెరుగుతూనే ఉందన్నారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదం విస్తరిస్తోందని చెప్పారు.

ఐరాస కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్‌కు భారత దేశం ఈ ఏడాది 5 లక్షల డాలర్లను అందజేస్తుందని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో సభ్య దేశాల సత్తాను పెంచేందుకు సహాయపడటం కోసం ఈ నిధులను ఇస్తామని తెలిపారు.

ఈ సమావేశాలు మొదటి రోజు ముంబైలోనూ, రెండో రోజు ఢిల్లీలోనూ జరిగాయి.

Updated Date - 2022-10-29T13:59:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising