IndianArmy: శత్రు దేశాల డ్రోన్లను వేటాడేందుకు గద్దలకు ప్రత్యేక శిక్షణ.. గాల్లోనే డ్రోన్ కూల్చివేత
ABN, First Publish Date - 2022-11-29T22:51:29+05:30
భారత సైన్యం (IndianArmy) సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. శత్రు దేశాల కుట్రలను కట్టడి చేసేందుకు సరికొత్త ఆయుధాన్ని సన్నద్ధం చేసింది.
హైదరాబాద్: భారత సైన్యం (IndianArmy) సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. శత్రు దేశాల కుట్రలను కట్టడి చేసేందుకు సరికొత్త ఆయుధాన్ని సన్నద్ధం చేసింది. శత్రు దేశాల డ్రోన్లను కట్టడి చేసేందుకు గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. డ్రోన్లను వేటాడేలా గద్దలకు భారత సైన్యం ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఔలీలో భారత్, అమెరికా ఉమ్మడి సైనిక శిక్షణ కసరత్తులు 'యుద్ధ్ అభ్యాస్'లో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట ఓ డ్రోన్‌ను గాల్లో ఎగురవేయడంతో ఆ శబ్దాన్ని గమనించిన ఓ ఆర్మీ శునకం సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే డ్రోన్లను వేటాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న 'అర్జున్' అనే గద్ద గాల్లో ఎగురుతున్న డ్రోన్‌ను ఇట్టే కనిపెట్టి కూల్చివేసింది. అయితే శత్రు దేశాల డ్రోన్లను వేటాడేందుకు గద్దలను ఉపయోగించడం మొదటిసారని సైనిక అధికారులు పేర్కొన్నారు. శత్రు దేశాలు డ్రోన్లతో గూఢచర్యం, స్మగ్లింగ్ కోసం చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం కొత్త వ్యూహాలతో తిప్పికొడుతోంది.
Updated Date - 2022-11-29T23:04:18+05:30 IST