ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russian Oil : పెట్రోలు కొనడంలో ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట : జైశంకర్

ABN, First Publish Date - 2022-12-07T19:45:22+05:30

సరసమైన బేరం కుదిరే చోటుకు వెళ్లి కొనడమనేది భారతీయుల ప్రయోజనం కోసమేనని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సరసమైన బేరం కుదిరే చోటుకు వెళ్లి కొనడమనేది భారతీయుల ప్రయోజనం కోసమేనని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు బుధవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ, రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనడం గురించి వివరించారు. పాశ్చాత్య దేశాలు రష్యన్ ఇంధనంపై విధించిన పరిమితుల వల్ల ఎనర్జీ మార్కెట్ల స్థిరత్వం, ధరలు అందుబాటులో ఉండటంపై ప్రభావం పడుతుందేమోననే ఆందోళన వ్యక్తం చేశారు.

రష్యన్ చమురును కొనాలని తాము భారతీయ కంపెనీలను కోరడం లేదని, అత్యుత్తమమైన అవకాశం ఎక్కడ లభిస్తే అక్కడ కొనాలని మాత్రమే చెబుతామని తెలిపారు. అది మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. భారతీయుల ఉత్తమ ప్రయోజనాల దృష్ట్యా ఏది సరైన బేరమో అక్కడికి వెళ్లి కొనడం తెలివైన విధానమని చెప్పారు.

జర్మన్ మంత్రి అన్నాలెనా బేర్‌బ్రోక్‌ సమక్షంలో సోమవారం జైశంకర్ మాట్లాడుతూ, చమురు కొనుగోలులో యూరోపియన్ యూనియన్, భారత దేశం మధ్య తేడాలను వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి నవంబరు 27 మధ్యలో యూరోపియన్ యూనియన్ 50 బిలియన్ డాలర్ల విలువైన గ్యాస్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుందని చెప్పారు. అంతకుముందు కన్నా 50 శాతం ఎక్కువ బొగ్గును దిగుమతి చేసుకుందన్నారు. మిగిలిన పది దేశాలు దిగుమతి చేసుకున్న మొత్తం చమురు కన్నా ఎక్కువ చమురు కేవలం యూరోపియన్ యూనియన్ ఈ కాలంలో దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు ధరలు హేతుబద్ధత లేకుండా అధికంగా ఉన్నాయని చెప్పారు.

ప్రపంచంలో చమురు వినియోగం, దిగుమతిదారుల్లో భారత దేశం మూడో స్థానంలో ఉంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా తక్కువ ధరకు చమురును విక్రయిస్తోంది. దీంతో అక్కడి నుంచి మన దేశం చమురును కొనుగోలు చేస్తోంది. దీనిపై ఉక్రెయిన్, ఇతర దేశాలు మన దేశాన్ని విమర్శిస్తున్నాయి. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా (Dmytro Kuleba) ఇటీవల మాట్లాడుతూ, రష్యా నుంచి చమురును కొనాలని భారత దేశం తీసుకున్న నిర్ణయం నైతికంగా సరైనది కాదని విమర్శించారు. యూరోపియన్లు కూడా రష్యా నుంచి చమురును కొంటున్నారని భారత ప్రభుత్వం సమర్థించుకోవడం పూర్తిగా తప్పు అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-07T19:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising