ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirbhaya fund: ‘నిర్భయ’ నిధులతో బొలెరో వాహనాలు... షిండే వర్గం ఎమ్మెల్యేలకు షాక్...

ABN, First Publish Date - 2022-12-13T12:00:27+05:30

‘నిర్భయ’ నిధులతో కొనుగోలు చేసిన బొలెరో వాహనాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే

Maharashtra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ‘నిర్భయ’ నిధులతో కొనుగోలు చేసిన బొలెరో వాహనాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గం శివసేన ఎమ్మెల్యేల రక్షణ కోసం ఉపయోగిస్తుండటంపై విమర్శలు పెల్లుబుకుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో ఇవి అందుబాటులో లేకపోవడం వల్ల పోలీసుల విధులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. వాటిలో కొన్ని వాహనాలను తిరిగి యథాతథంగా పోలీస్ స్టేషన్లకు తరలించింది.

ఈ బొలెరో వాహనాల్లో కొన్నిటిని నగర శివారు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకొచ్చారు. ముంబై పోలీస్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ యూనిట్ గ్యారేజిలో వీటిలో కొన్నిటినీ సోమవారం పార్క్ చేశారు. ఇక్కడ పార్క్ చేసినవాటిని తిరిగి శివాజీ నగర్, ఘట్కోపర్, ములుంద్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

మరికొన్ని రోజుల్లో మిగిలిన బొలెరో వాహనాలను కూడా వాటిని ఏయే పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకొచ్చారో, ఆయా పోలీస్ స్టేషన్లకు తిరిగి పంపించనున్నట్లు తెలిసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో నిర్భయ నిధులతో 220 బొలెరో వాహనాలు కొనుగోలు చేసింది. వీటిలో 47 వాహనాలను ఎమ్మెల్యేలకు రక్షణ కోసం పంపించింది. కొద్ది వారాల తర్వాత 17 వాహనాలను తిరిగి ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించింది. మిగిలినవి ఎమ్మెల్యేల కాన్వాయ్‌లలోనే ఉంటున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇటీవల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కాన్వాయ్‌లలో వాడుతున్న బొలెరో వాహనాలను తిరిగి ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించకపోతే తాము నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-12-13T12:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising