ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mukesh Ambani : 5జీ కంటే మాతాజీ, పితాజీ ఎక్కువ!

ABN, First Publish Date - 2022-12-04T00:54:21+05:30

‘‘ఈ రోజుల్లో యువత 4జీ, 5జీ అంటూ ఉత్సాహం చూపుతున్నారు. ఎన్నటికీ మాతాజీ (అమ్మ), పితాజీ(నాన్న) మాత్రమే గొప్ప’’ అని భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థులకు ముకేశ్‌ అంబానీ హితవు

గాంధీనగర్‌. డిసెంబరు 3: ‘‘ఈ రోజుల్లో యువత 4జీ, 5జీ అంటూ ఉత్సాహం చూపుతున్నారు. ఎన్నటికీ మాతాజీ (అమ్మ), పితాజీ(నాన్న) మాత్రమే గొప్ప’’ అని భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు. ఇటీవల గుజరాత్‌లోని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన విద్యార్థులకు హితబోధ చేశారు. ‘‘మీరు ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఈ రోజు మీది కావొచ్చు. కానీ, మీరు నిలబడ్డది మీ తల్లిదండ్రుల రెక్కల కష్టంపైనే అన్నది మరచిపోవొద్దు’’ అని వ్యాఖ్యానించారు. మీరంతా వేదికపైన డిగ్రీ పట్టాలు పుచ్చుకుంటుంటే.. ఆ క్షణాలను చూసేందుకు వారెంతగా ఎదురుచూశారో గుర్తుంచుకోవాలన్నారు. ‘‘ఈ క్షణం(విద్యార్థులు పట్టా పుచ్చుకోవడం) వారు జీవితాంతం కన్న కల. వారి కష్టాలు, త్యాగాలను ఎన్నటికీ మరవొద్దు. ఆ త్యాగాలే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాయి’’ అంటూ తల్లిదండ్రుల గొప్పదనాన్ని వివరించారు. తమ పురోగతిని ఎప్పటికప్పుడు వారితో పంచుకోవాలని హితవుపలికారు.

Updated Date - 2022-12-04T00:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising