ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Journalism Bill : వార్తలపై నిషేధం : మెటా హెచ్చరిక

ABN, First Publish Date - 2022-12-06T17:07:23+05:30

జర్నలిజం బిల్లును ఆమోదిస్తే తమ వేదికపై వార్తల ప్రచురణను నిలిపేస్తామని అమెరికా ప్రభుత్వాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జర్నలిజం బిల్లును ఆమోదిస్తే తమ వేదికపై వార్తల ప్రచురణను నిలిపేస్తామని అమెరికా ప్రభుత్వాన్ని మెటా (Meta) టెక్నాలజీ కంపెనీ హెచ్చరించింది. మెటాలో వార్తలు, కంటెంట్‌ను పెట్టే ప్రచురణకర్తలకు సొమ్ము చెల్లించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించింది. ప్రచురణకర్తలకు ట్రాఫిక్, సబ్‌స్క్రిప్షన్స్ పెరగడం కోసం తాను అందిస్తున్న సేవలకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని పేర్కొంది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే, గూగుల్, ఫేస్‌బుక్‌లలో కంటెంట్‌ను పోస్ట్ చేసే ప్రచురణకర్తలు ఆ కంపెనీలతో బేరసారాలు జరపడానికి వీలవుతుంది.

అమెరికా ప్రభుత్వం గత ఏడాది జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ (JCPA)ను ప్రవేశపెట్టింది. దీనికి అమెరికా సెనేట్ జ్యుడిషియరీ కమిటీ సెప్టెంబరులో ఆమోదం తెలిపింది. అయితే ఫుల్ సెనేట్‌లో ఆమోదం పొందవలసి ఉంది.

ఈ నేపథ్యంలో మెటా కంపెనీ పాలసీ కమ్యూనికేషన్స్ చీఫ్ ఆండీ స్టోన్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. జాతీయ భద్రతా చట్టంలో భాగంగా సరిగ్గా పరిశీలించని జర్నలిజం బిల్లును కాంగ్రెస్ ఆమోదిస్తే, ప్రభుత్వ నిర్దేశిత చర్చలకు లొంగిపోవడం కన్నా మొత్తంగా తన ప్లాట్‌ఫారం నుంచి న్యూస్‌ను తొలగించడాన్ని పరిశీలించక తప్పని పరిస్థితి వస్తుందన్నారు. తన ప్లాట్‌ఫారంపై తమ కంటెంట్‌ను ప్రచురణకర్తలు, బ్రాడ్‌కాస్టర్లు తమంతట తాముగానే పోస్ట్ చేస్తున్నారని, అలా చేయడం వల్ల వారికి ప్రయోజనం కలుగుతోందని, ఈ విషయాన్ని ఈ బిల్లు గుర్తించడం లేదని తెలిపారు. యూజర్లు చూడాలని అనుకోని కంటెంట్‌కు సొమ్ము చెల్లించాలని ఏ కంపెనీని అయినా నిర్బంధించకూడదని చెప్పారు. ఇది అర్థవంతమైన ఆదాయ వనరు కాదని తెలిపారు. ధరలను నియంత్రించడం కోసం కొందరు ఉత్పత్తిదారులు కలిసి కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఏర్పడే సంస్థ (cartel)ను ప్రభుత్వం సృష్టిస్తోందని ఆరోపించారు. ఒక ప్రైవేట్ కంపెనీ, ఇతర ప్రైవేట్ కంపెనీలకు రాయితీలివ్వవలసిన అవసరం ఉండటం అన్ని అమెరికన్ వ్యాపార సంస్థలకు భయానక దృష్టాంతం అవుతుందన్నారు.

గత సంవత్సరం ఆస్ట్రేలియాలో ఇటువంటి చట్టం నేపథ్యంలోనే ఫేస్‌బుక్ న్యూస్‌ను తొలగించింది. కంటెంట్ పబ్లిషర్లకు సొమ్ము చెల్లించాలని ఈ చట్టం చెప్తోంది. ఆ తర్వాత న్యూస్ కంటెంట్‌ను పునరుద్ధరించింది. కెనడాలో కూడా ఇటువంటి చట్టం ఉంది. ఆ ప్రభుత్వాన్ని కూడా ఫేస్‌బుక్ హెచ్చరించింది.

Updated Date - 2022-12-06T17:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising