ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asaduddin Owaisi: మోదీ అలా.. జైశంకర్ ఇలా: జిన్‌పింగ్‌తో మోదీ కరచాలనంపై అసదుద్దీన్ ఫైర్

ABN, First Publish Date - 2022-11-26T18:14:01+05:30

భారత ప్రధాని నరేంద్రమోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాటలకు పొంతన లేకుండా పోయిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాటలకు పొంతన లేకుండా పోయిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asduddin Owaisi) మండిపడ్డారు. చైనా విషయంలో తాము దృఢవైఖరితో ఉన్నామని జైశంకర్ చెబుతుంటే.. ప్రధాని మాత్రం జిన్ పింగ్‌తో చేతులు కలిపి మాట్లాడుతున్నాని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా గల్వాన్ ఘర్షణల సమయంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అసద్ వరుస ట్వీట్లలో దుమ్మెత్తి పోశారు. ‘‘అవును జైశంకర్ గారూ.. గల్వాన్ ఘర్షణ జరిగిన నాలుగు రోజుల తర్వాత భారత భూభాగంలోకి చైనా ప్రవేశించలేదని చెప్పడం ద్వారా మన 56 అంగుళాల ప్రధానమంత్రి చైనాపై చాలా దృఢంగా ఉన్నారు. ఆయన మౌనం కోసం మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు'’ అని ఓ ట్వీట్‌లో అసద్ ఫైరయ్యారు.

చైనా చొరబాట్లను నిరోధించేందుకు లడఖ్‌లో సైన్యాన్ని మోహరించడం మోదీ సాధించిన గొప్ప విజయం అయితే, 2020లో చైనా ఆర్మీ (PLA)కి కోల్పోయిన లడఖ్‌లోని భూభాగంపై నియంత్రణను నిలుపుకోవడంలో వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. దేశంలో బలహీనమైన, భయపడే రాజకీయ నాయకత్వం ఉందన్నారు. ప్రభుత్వానికి కనుక రాజకీయ సంకల్పం ఉంటే చాలా మంది భారతీయుల్లానే తాను కూడా మన సైన్యం లడఖ్‌లో 2020 నాటి యథాతథా స్థితిని పునరుద్ధరించగలదని తాను నమ్ముతానని ఒవైసీ అన్నారు. మనకు బలహీనమైన, భయపడే రాజకీయ నాయకత్వం ఉందని, ఇక్కడ దాని విదేశాంగ మంత్రికి సాకులు మాత్రమే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య సరిహద్దుల్లో లేదని, అది ఢిల్లీలో ఉందని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ఆ వ్యక్తి గొప్పలు చెప్పుకునేందుకు చైనాపై కళ్లెర్రజేసి చూస్తాడని, కానీ ఇప్పుడు బాలిలో జిన్‌పింగ్‌తో చేతులు కలిపి మాట్లాడతాడని విమర్శించారు.

చైనా విధానంపై ఇంత కచ్చితత్వం ఉన్న ప్రభుత్వం పార్లమెంటులో చర్చకు రమ్మంటే ఎందుకు పారిపోతోందని ఒవైసీ ప్రశ్నించారు. ఏప్రిల్ 2020కి ముందున్న లడఖ్‌లోని ప్రాంతాలను మన పెట్రోలింగులు ఎప్పుడు వెళ్లబోతున్నాయని, డెప్సాంగ్, డెమ్చోక్‌లు ఎప్పుడు పరిష్కారమవుతాయని నిలదీశారు. ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయని ప్రశ్నించిన ఒవైసీ వీటన్నింటికీ మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-11-26T18:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising