ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hindu minorities : హిందూ మహిళ పాశవిక హత్య... పాకిస్థాన్‌పై భారత్ ఆగ్రహం...

ABN, First Publish Date - 2022-12-29T19:08:21+05:30

మైనారిటీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యతను నెరవేర్చాలని పాకిస్థాన్‌ను భారత్ కోరింది.

Arindam Bagchi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మైనారిటీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యతను నెరవేర్చాలని పాకిస్థాన్‌ను భారత్ కోరింది. వారికి భద్రత, రక్షణ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ దేశంలోని సింఝోరోలో ఓ హిందూ మహిళ (40) తలను తెగనరికి, ఆమె వక్షోజాలను కోసేసి, ఆమె చర్మాన్ని ఒలిచేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం స్పందించింది.

పాకిస్థాన్‌ తొలి హిందూ మహిళా సెనేటర్ కృష్ణ కుమారి ఇచ్చిన ట్వీట్‌లో, సింఝోరో పట్టణంలో బుధవారం దాదాపు 40 సంవత్సరాల వయసుగల హిందూ మహిళ దయా భెల్ తలను తెగ నరికి, ఆమె వక్షోజాలను కోసేసి, ఆమె ముఖం, శరీర భాగాల్లోని చర్మాన్ని ఒలిచారని వెల్లడించారు. మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలానికి తాను వెళ్ళానని, సింఝోరో, షాపుర్చకర్ పోలీసులు కూడా చేరుకున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో గురువారం విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి (Arindam Bagchi) స్పందిస్తూ, ఈ సంఘటన గురించి సవివరమైన నివేదిక తన వద్ద లేదని చెప్పారు. మైనారిటీలపట్ల పాకిస్థాన్‌ శ్రద్ధ వహించాలని గతంలో కూడా చెప్పామన్నారు. మైనారిటీల రక్షణ, భద్రత, సంక్షేమాల కోసం చర్యలు తీసుకోవలసిన బాధ్యత పాకిస్థాన్‌కు ఉందని, ఆ బాధ్యతను ఆ దేశం నెరవేర్చాలని చెప్పారు. ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నానని చెప్పారు.

Updated Date - 2022-12-29T19:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising