Rajasthan: ఒకే వేదికను పంచుకున్న మోదీ, గెహ్లాట్
ABN, First Publish Date - 2022-11-01T12:32:43+05:30
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఒకే వేదిక పంచుకున్నారు. మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఉభయులూ పాల్గొన్నారు. ఇద్దరూ తాము ముఖ్యమంత్రులుగా కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi), రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok gehlot) ఒకే వేదిక పంచుకున్నారు. మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఉభయులూ పాల్గొన్నారు. ఇద్దరూ తాము ముఖ్యమంత్రులుగా కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో ముఖ్యమంత్రులుగా తాను, గెహ్లాట్ కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ''మేము సీఎంలుగా ఉన్న సమయంలో గెహ్లాట్ సీనియర్. ఇప్పుడు వేదికపై ఉన్న సీనియర్ మోస్ట్ సీఎంలలో ఆయన ఒకరు'' అని ప్రధాని అన్నారు.
దీనికి ముందు గెహ్లాట్ తన ప్రసంగంలో మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన గొప్ప గౌరవం లభిస్తోందని అన్నారు. ''ప్రధాని మోదీ విదేశాలకు ఎప్పుడు వెళ్లినా అక్కడ విశేష గౌరవం లభిస్తోంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనుకున్న జాతిపిత గాంధీ పుట్టిన దేశానికి ఆయన ప్రధాని. అలాంటి దేశానికి ప్రధానిగా మోదీ తమ దేశం వచ్చినందుకు అక్కడి వారంతా గర్వపడుతుంటారు'' అని గెహ్లాట్ అన్నారు
Updated Date - 2022-11-01T12:35:43+05:30 IST