ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi: అమ్మతో ముచ్చట్లు.. చిరునవ్వులు చిందించిన మోదీ

ABN, First Publish Date - 2022-12-04T18:58:30+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ను గాంధీనగర్ నివాసంలో కలుసుకున్నారు.

Modi meets his mother Heeraben
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ను గాంధీనగర్ నివాసంలో కలుసుకున్నారు. ఆశీస్సులు తీసుకున్నాక అమ్మ పక్కనే కూర్చుని చాయ్ తాగారు. అమ్మతో చాలాసేపు ముచ్చటించారు. తల్లితో ముచ్చట్ల సమయంలో మోదీ చిరునవ్వులు చిందించారు. ఈ ఏడాది జూన్ 18న వందో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా కూడా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ను కలుసుకున్నారు.

తల్లి హీరాబెన్‌తో సమావేశం తర్వాత మోదీ గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. సోమవారం జరిగే గుజరాత్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికల్లో మోదీ అహ్మదాబాద్‌లో ఓటేస్తారు.

ఈ నెల 5న మొత్తం 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 14, 975 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,13,325 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడతలో కచ్‌-సౌరాష్ట్ర, దక్షిణ గు జరాత్‌ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 63 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 2017లో జరిగిన మొదటి విడతలో 66.75 శాతం పోలింగ్‌ నమోదైంది.

Updated Date - 2022-12-04T19:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising