Jairam Ramesh: రాహుల్ సైద్ధాంతిక దిక్సూచి, భారత్ జోడో రియల్ బూస్టర్ డోస్
ABN, First Publish Date - 2022-11-02T16:46:08+05:30
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో యాత్రతో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతనోత్తేజం తొణికిసలాడుతోందని..
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో యాత్రతో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతనోత్తేజం తొణికిసలాడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. బ్యాక్ సీట్ డ్రైవింగ్‌కు రాహుల్ ఇష్టపడరని, ఆయన విలువల ప్రాతిపదికపై పార్టీని ముందుకు తీసుకువెళ్లే సైద్ధాంతిక దిక్యూచి (Ideological compass) అని అన్నారు.
రాహుల్ గాంధీని కొందరు గదిలో ఉన్న గజరాజుతో పోల్చడాన్ని జైరామ్ రమేష్ తోసిపుచ్చారు. ఆయన గదిలో ఉన్న గజరాజు కాదని, రోడ్‌పై ఉన్న టైగర్ అని అన్నారు. భారత్ జోడో యాత్ర జనంతో పార్టీ మమేకమవడానికి ఉపకరించే 'రియల్ బూస్టర్ డోస్' అని అభివర్ణించారు. కాంగ్రెస్ నైతికబలం ఇప్పుడు ఆసాధరణ స్థాయిలో ఉందని, ప్రజా మద్దతు చిరకాలం కొనసాగేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు సంస్థపైనే ఉందని అన్నారు. రాహుల్ గాంధీ చుట్టూ స్పిన్ మిషన్ లేదని, రోజుకూ 22 నుంచి 23 కిలోమీటర్లు నడుస్తూ వేలాది మంది ప్రజలతో సమావేశమవుతూ, వివిధ సంస్థలను కలుస్తున్నారని అన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత వైవిధ్యమైన రాహుల్‌ను చూస్తామనడంలో సందేహం లేదని జైరామ్ రమేష్ అన్నారు.
Updated Date - 2022-11-02T17:43:13+05:30 IST