ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi: ప్రధాని మోదీకి బాసటగా రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2022-12-28T15:55:32+05:30

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బాసటగా నిలిచారు.

Rahul Gandhi tweets to Prime Minister Narendra Modi,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Prime Minister Narendra Modi) కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) బాసటగా నిలిచారు. మోదీ తల్లి హీరాబెన్ (Heeraben Modi) అస్వస్థతకు గురై అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో తల్లీ కొడుకుల మధ్య ప్రేమ వెలకట్టలేనిదంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో మోదీ వెంటే తానుంటానన్నారు. మోదీ తల్లి త్వరగా కోలుకోవాలంటూ రాహుల్ ఆకాంక్షించారు.

ఇటీవలే 100వ పడిలోకి అడుగుపెట్టిన మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థత కారణంగా అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో చేరగానే బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యేలు దర్శబెన్ వాఘేలా, కౌషిక్ జైన్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గత జూన్‌లో హీరాబెన్ 99వ పుట్టినరోజుకు కూడా మోదీ హాజరయ్యారు. నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్న తన తల్లి గురించి 'మదర్' అనే టైటిల్‌తో మోదీ ఒక ఎమోషనల్ బ్లాగ్ కూడా రాశారు. ప్రధాన మంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు కర్ణాటకలోని మైసూరులో మంగళవారంనాడు కారు ప్రమాదంలో గాయపడిన కొద్ది గంటలకే హీరాబెన్ ఆసుపత్రిలో చేరడం వారి ఆత్మీయులను ఆందోళనకు గురిచేసింది.

తల్లిని చూసేందుకు ప్రధానమంత్రి మోదీ అహ్మదాబాద్ ఆసుపత్రికి చేరుకున్నారు.

Updated Date - 2022-12-28T16:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising