ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gehlot Vs Pilot: గులాం నబీ ఆజాద్ ఎపిసోడ్‌ రిపీట్!

ABN, First Publish Date - 2022-11-02T17:15:20+05:30

అల్వార్: రాజస్థాన్‌లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

Ashok Gehlot, Rahul Gandhi, Sachin Pilot
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్వార్: రాజస్థాన్‌లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధాని పొగడ్త అశోక్ గెహ్లాట్‌కు తంటాలా మారింది. రాజస్థాన్ బన్స్వారాలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అశోక్ గెహ్లాట్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. గెహ్లాట్ సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి అని, స్టేజిపైన కూర్చున్న వారిలో కూడా అందరికన్నా ఎక్కువ అనుభవం గల ముఖ్యమంత్రి అని ప్రధాని మోదీ పొగిడారు.

సమావేశం పూర్తైన 24 గంటల తర్వాత అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని మోదీ పొగడ్తలను తేలిగ్గా తీసుకోరాదని సచిన్ పైలట్ మీడియా సాక్షిగా వ్యాఖ్యానించారు. అంతే కాదు గతంలో పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌పై పొగడ్తలు చేసిన సందర్భాన్ని సచిన్ పైలట్ గుర్తు చేశారు. ప్రధాని పొగడ్తల తర్వాత ఆజాద్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని పైలట్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ప్రధాని పొగడ్తల తర్వాత కొంత కాలానికి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ విషయంలోనూ అలాంటి సీనే రిపీట్ కావొచ్చని అర్థం వచ్చేలా సచిన్ పైలట్ మాట్లాడటం దుమారం రేపుతోంది.

సచిన్ పైలట్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు, పరస్పర విమర్శలు చేసుకోవద్దని చెప్పిన విషయాన్ని గెహ్లాట్ గుర్తు చేస్తున్నారు. అందరూ క్రమశిక్షణ పాటించాల్సిందేనని గెహ్లాట్ స్పష్టం చేశారు.

గెహ్లాట్-సచిన్ వైరం నేటిది కాదు

గెహ్లాట్-సచిన్‌ల మధ్య చాలాకాలంగా వైరం ఉంది. గెహ్లాట్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని సచిన్ గతంలో డిమాండ్ చేశారు. తన వర్గం ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టి కలకలం రేపారు. అయితే అధిష్టానం చాకచక్యంగా వ్యవహరించి పైలట్‌ను దారిలోకి తెచ్చింది. అసమ్మతిని అణచివేసింది. సంయమనం పాటించాలని, సరైన తరుణంలో సచిన్ పైలట్‌ను సీఎం చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ కూడా ఇచ్చింది. ఇటీవల జరిగిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్‌ను బరిలోకి దించి సచిన్ పైలట్‌‌ను రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచించింది. అయితే తాను ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూనే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా ఉంటానని, తనను జోడు పదవులకు అనుమతించాలని గెహ్లాట్ కోరారు. దీనికి సోనియా, రాహుల్ చెక్ పెట్టారు. దీంతో గెహ్లాట్‌ తన వర్గీయుల్లో ఒకరిని రాజస్థాన్ సీఎం చేయాలని పట్టుబట్టారు. సచిన్ పైలట్‌ను మాత్రం రాజస్థాన్ సీఎం చేయవద్దని మెలిక పెట్టారు. గెహ్లాట్ ప్రతిపాదనపై మండిపడ్డ కాంగ్రెస్ అధిష్టానం గెహ్లాట్‌ను అధ్యక్ష పదవికి పోటీపడవద్దని సూచించింది. అంతేకాదు రాజస్థాన్ నాయకులందరూ మౌనంగా ఉండాలని ఆదేశించింది. నాటి నుంచీ అందరూ మౌనంగా ఉన్నా ప్రధాని నిన్న రాజస్థాన్‌లో గెహ్లాట్‌ను పొగడటంతో సచిన్ పైలట్ రంగంలోకి దిగారు. ఆజాద్ సీన్ రిపీట్ కావొచ్చని అప్రమత్తంగా ఉండాలని అధిష్టానానికి సూచించడం ప్రకంపనలు రేపుతోంది. సచిన్ వ్యాఖ్యలపై సీఎం గెహ్లాట్ గుర్రుగా ఉన్నారు.

Updated Date - 2022-11-02T17:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising