ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rishabh Pant: పంత్ నగలు,డబ్బు చోరీ కాలేదు...పోలీసు డీజీపీ స్పష్టం

ABN, First Publish Date - 2022-12-31T09:05:36+05:30

భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత అతని వస్తువులు చోరీ కాలేదని...

Rishabh Pant accident
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిద్వార్ : భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత అతని వస్తువులు చోరీ కాలేదని ఉత్తరాఖండ్ పోలీసులు చెప్పారు.(Rishabh Pant accident)రిషబ్ పంత్ వస్తువులు ఎవరూ దొంగిలించలేదని(Belongings were Not Stolen), అతని వస్తువులను అతని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ పిఎస్ అశోక్ కుమార్ తెలిపారు.(Uttarakhand police) డిసెంబర్ 30 తెల్లవారుజామున జరిగిన ఘోర కారు ప్రమాదం నుండి తప్పించుకుని ఆసుపత్రి పాలయ్యాడు.రోడ్డు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఎస్పీ దేహత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షులను ఆరా తీయగా ప్రమాదం జరిగిన తర్వాత రిషబ్ పంత్ వస్తువులు లూటీకి గురికాలేదని తేలింది.

కొన్ని బట్టలతో కూడిన బ్యాగ్ మినహా అతని సామాన్లు పూర్తిగా కాలిపోయాయని పోలీసులు వెల్లడించారు.రిషబ్ పంత్ ధరించిన నగలు,ప్లాటినం చైన్, బంగారు బ్రాస్‌లెట్, నాలుగు వేల రూపాయల నగదు, దుస్తులు ఉంచిన సూట్‌కేస్‌లను అతని తల్లికి అప్పగించారు. పంత్ వస్తువులు దొంగిలించారనే సమాచారం అవాస్తవమని డీజీపీ స్పష్టం చేశారు. తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచారం చేయవద్దని డీజీపీ అశోక్ కుమార్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ వీడియోను కూడా ట్విట్టరులో షేర్ చేశారు.

Updated Date - 2022-12-31T09:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising