Bharat jodi yatra: ఫోటో షేర్ చేసిన రితీష్ దేశ్‌ముఖ్, ట్విటర్ యూజర్ సూటి ప్రశ్న..
ABN, First Publish Date - 2022-11-13T16:34:17+05:30
బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ (Ritesish Deshmukh) 'భారత్ జోడో యాత్ర'లో తన తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్...
ముంబై: బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ (Ritesish Deshmukh) 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo yatra)లో తన తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఫోటోను అభిమానులు ప్రదర్శించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్వటర్‌లో షేర్ చేశారు. రితీష్ భార్య జెనీలియా కూడా ఈ ఫోటోను షేర్ చేశారు. సోషల్ మీడియా యూజర్లు సైతం తమ సంతోషాన్ని రితీష్‌తో పంచుకుంటూ రీట్వీట్ చేశారు. ''మీరెప్పుడు భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు?'' అని ఇంద్రాణి ముఖర్జీ అనే ఒక యూజర్ ప్రశ్నించగా, ''మీరెక్కడ ఉన్నారు? మీరు కూడా మీ బలాన్ని చాటుకునే సమయం ఆసన్నమైంది...అంటూ మరో యూజర్ సూచించారు.
రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో బాలీవుడ్ నటులు పూజాభట్, సుషాంత్ సింగ్ పాల్గొన్నారు. హైద్రాబాద్‌లో రాహుల్‌తో పూజాభట్ కలిసి నడవగా, సుషాంత్ సింగ్ మహారాష్ట్రలో జోడో యాత్ర అడుగుపెట్టగానే అందులో పాల్గొన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమిత్ దేశ్‌ముఖ్, రితీష్ దేశ్‌ముఖ్ సోదరుడు సైతం రాష్ట్రంలో భారత్ జోడోకు స్వాగతం పలికారు. ''విద్వేష వ్యాప్తి జరగవచ్చేమో కానీ, ప్రేమ, సామరస్యం కోసం ప్రచారం చేపట్టడం అంత సులభం కాదు. ప్రేమలో ప్రతీదీ కోల్పోయినా, విజయం మీ వెంటే ఉంటుంది'' అని సుషాంత్ సింగ్ ఇటీవల జోడో యాత్రలో పాల్గొంటూ చెప్పారు. ఎన్‌సీపీ నేత సుప్రియా సులె, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నేత ఆదిత్య థాకరే సైతం రాహుల్ జోడో యాత్రలో ఆయనతో కలిసి పాల్గొన్నారు. సిద్ధాంతాలు వేరైనా, భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను యాత్రలో పాల్గొన్నట్టు ఆదిత్య తెలిపారు.
Updated Date - 2022-11-13T16:35:26+05:30 IST