ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RSS: సంస్కృతి పరంగా దేశంలో 99% మంది ముస్లింలు హిందూస్థానీలే

ABN, First Publish Date - 2022-11-13T21:34:35+05:30

సంస్కృతీ సంప్రదాయాలు, పూర్వీకుల పరంగా దేశంలో 99% మంది ముస్లింలు హిందూస్థానీ(Hindustani)లేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్...

Rashtriya Swayamsevak Sangh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థానే: సంస్కృతీ సంప్రదాయాలు, పూర్వీకుల పరంగా దేశంలో 99% మంది ముస్లింలు హిందూస్థానీ(Hindustani)లేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) అభిప్రాయపడింది. భారత్‌లో అందరి పూర్వీకులు ఒకరేనని, అందరి డీఎన్ఏ (DNA) ఒకటేనని ఆర్ఎస్ఎస్ (RSS) నేత ఇంద్రేశ్ కుమార్ (Indresh Kumar) తెలిపారు. మహారాష్ట్ర థానే జిల్లా ఉత్తాన్‌లో ముస్లిమ్ రాష్ట్రీయ మంచ్ (Muslim Rashtriya Manch) నేతృత్వంలో జరిగిన రెండు రోజుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కులమతాలకు అతీతంగా దేశాన్నే ప్రథమ ప్రాధాన్యతగా అందరూ స్వీకరించాలని ఇంద్రేశ్ కుమార్ పిలుపునిచ్చారు.

గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్‌ కూడా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఆ వ్యాఖ్యలనే ఉదహరించిన ఇంద్రేశ్‌కుమార్ డీఎన్ఏకు అర్థం వివరించారు. డీ అంటే డ్రీమ్స్ (కలలు) అని, ఎన్ అంటే నేషన్ (దేశం) అని, ఏ అంటే ఏన్సిస్టర్స్ (పూర్వీకులు) అని వివరించారు. మహారాష్ట్రలోని విభిన్న ప్రాంతాల నుంచి 250మందికి పైగా కార్యకర్తలు ముస్లిమ్ రాష్ట్రీయ మంచ్ సమావేశంలో పాల్గొన్నారు. ముస్లిం మహిళా కార్యకర్తలు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-13T21:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising