Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు Y ప్లస్ కేటగిరి భద్రత
ABN, First Publish Date - 2022-11-01T17:41:19+05:30
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. 'వై ప్లస్' భద్రతా కేటగిరి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సల్మా్న్‌ను చంపుతామంటూ ఆయనకు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదరింపు లేఖలు వచ్చాయన్న కారణంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. 'వై ప్లస్' (Y plus) భద్రతా కేటగిరి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సల్మా్న్‌ను చంపుతామంటూ ఆయనకు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదరింపు లేఖలు వచ్చాయన్న కారణంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సల్మాన్‌కు తాజాగా పెంచిన భధ్రతా కేటగిరి కింద నలుగురు సాయుధ సెక్యూరిటీ సిబ్బంది అన్నివేళలా ఆయనతోనే ఉంటారు.
అక్షయ్, అనుమప్ ఖేర్‌లకు సైతం..
బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌కు సైతం మహారాష్ట్ర ప్రభుత్వ భద్రత కల్పించింది. అక్షయ్ కుమార్‌కు X కేటగిరి భద్రత కేటాయించారు. ఈ కేటగిరి కింద ముగ్గురు భద్రతా అధికారులు షిఫ్టులుగా ఆయనకు భద్రత కల్పిస్తారు. అనుమప్ ఖేర్‌కు సైతం X కేటగిరి భద్రత కల్పించారు. కాగా, తమకు కేటాయించిన భద్రతకు అయ్యే ఖర్చును ఆయా సెలబ్రెటీలే భరిస్తారు.
ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలిందంటే...
ముంబై, పంజాబ్, ఢిల్లీలో జరిపిన ఇన్వెస్టిగేషన్‌లో ఇటీవల పలు విషయాలు బయటకు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లు సల్మాన్‌ఖాన్‌ను ముంబైలోనే మట్టుబెట్టేందుకు ప్లాన్ చేశారు. రెండు సార్లు ఈ ప్రయత్నాలు జరిగినట్టు చెబుతున్నారు. 2017లో బాంద్రా హౌస్ వెలుపల ఆయన పుట్టినరోజు వేడుకల్లోనూ, రెండోసారి 2018లో ఆయన పాన్వెల్ ఫామ్‌హౌస్ వద్ద మట్టుబెట్టేందుకు ప్లాన్ జరిగింది. అనుపమ్ ఖేర్‌కు 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా విడుదలైన తర్వాత బెదరింపులు రావడంతో భద్రత పెంచారు. నేషనాలిటీకి సంబంధించిన విషయంలో సోషల్ మీడియాలో బెదరింపులు రావడంతో అక్షయ్ కుమార్‌కు భద్రత మంజూరైంది.
Updated Date - 2022-11-01T17:41:22+05:30 IST