ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IAF fighter pilot : సానియా మీర్జాకు అరుదైన ఘనత దక్కబోతోందా?

ABN, First Publish Date - 2022-12-23T18:06:17+05:30

సానియా మీర్జా (Sania Mirza) అత్యంత అరుదైన ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ

Sania Mirza
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సానియా మీర్జా (Sania Mirza) అత్యంత అరుదైన ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షలో ఆమెకు 149వ ర్యాంకు లభించింది. దీంతో ఆమె ఫైటర్ పైలట్ స్త్రీమ్‌ను ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది, విజయవంతంగా పూర్తి చేస్తే, ఫైటర్ పైలట్‌గా నియమితురాలయ్యే అవకాశం వస్తుంది. ఆమె భారత వాయు సేన ఫైటర్ పైలట్‌గా నియమితురాలైతే, మన దేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ అవుతారు.

భారత వాయు సేన విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఫ్లయింగ్ బ్రాంచ్‌లో నిర్దేశిత శిక్షణను పొందవలసి ఉంటుంది. భారత వాయు సేనలో పైలట్‌గా నియమితురాలవడానికి నాలుగేళ్ళు పడుతుంది. ఫ్లయింగ్ బ్రాంచ్‌లో ఎయిర్ ఫోర్స్ కేడెట్‌గా ఎన్డీయేలో చేరే ఏ అభ్యర్థి అయినా మిగిలిన రెండు సర్వీసుల నుంచి వచ్చే కోర్స్‌మేట్స్‌తో కలిసి కంబైన్డ్ ట్రైనింగ్ పొందవలసి ఉంటుంది. ఈ శిక్షణ మూడేళ్ళపాటు ఉంటుంది. త్రివిధ దళాల మధ్య జాయింట్‌మన్‌షిప్‌ను సాధించాలనేదే ఎన్డీయే లక్ష్యం. అందువల్ల శిక్షణ అందరికీ కామన్‌గా ఉంటుంది. శిక్షణ పూర్తవడానికి ఆరు నెలల ముందు మాత్రమే ఫ్లయింగ్ ట్రైనింగ్‌లో ప్రాథమిక అంశాల బోధన జరుగుతుంది.

సానియా మీర్జా ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్, జసోవర్ గ్రామవాసి. ఆమె తండ్రి షాహిద్ టీవీ మెకానిక్‌గా పని చేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ, ఫ్లైట్ లెఫ్టినెంట్ అవని చతుర్వేది తనకు స్ఫూర్తి అని చెప్పారు. ఆమె నుంచి స్ఫూర్తి పొంది, తాను కూడా ఎన్డీయేలో చేరాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను హిందీ మాధ్యమంలో చదివానని, హిందీ మాధ్యమంలో చదివినవారు కూడా పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించవచ్చునని తెలిపారు. రెండో ప్రయత్నంలో తాను ఎన్డీయే ర్యాంకు సాధించానని చెప్పారు.

Updated Date - 2022-12-23T18:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising