ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sunny Leone: హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో బదులు సన్నీ లియోన్ పిక్.. దర్యాప్తునకు ఆదేశం

ABN, First Publish Date - 2022-11-08T21:06:07+05:30

ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరవ్వాల్సిన ఓ యువతికి షాకింగ్ పరిణామం ఎదురైంది. ఎగ్జామ్ హాల్ టికెట్‌పై (Hall ticket) తన ఫొటోకు బదులు బాలీవుడ్ నటి, మాజీ పోర్న్‌స్టార్ సన్నిలియోన్ (Sunny Leone) ఫొటో ముద్రించి ఉండడాన్ని చూసి యువతి కంగుతిన్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరవ్వాల్సిన ఓ యువతికి షాకింగ్ పరిణామం ఎదురైంది. ఎగ్జామ్ హాల్ టికెట్‌పై (Hall ticket) తన ఫొటోకు బదులు బాలీవుడ్ నటి, మాజీ పోర్న్‌స్టార్ సన్నిలియోన్ (Sunny Leone) ఫొటో ముద్రించి ఉండడాన్ని చూసి యువతి కంగుతిన్నది. కర్ణాటకలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఓ యువతి కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్‌ (Karnataka Teachers Recruitment) పరీక్ష రాయాల్సి ఉంది. హాల్ టికెట్ కూడా డౌన్‌లోడ్ చేసుకుంది. కానీ హాల్ టికెట్‌పై తన ఫొటోకు బదులు సన్నీలియోన్ ఫొటో ముద్రించి ఉండడాన్ని ఆమె గుర్తించింది. సదరు యువతి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారడంతో విపక్ష కాంగ్రెస్‌తోపాటు కర్ణాటక ప్రభుత్వ విద్యా శాఖ స్పందించాల్సి వచ్చింది. పరీక్ష అభ్యర్థి ఫొటోను తప్పుగా ముద్రించడంపై కాంగ్రెస్ మండిపడింది. హాల్ టికెట్‌పై మాజీ పోర్న్‌స్టార్ ఫొటోను ఎలా ముద్రించారంటూ కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్‌పర్సన్ బీఆర్ నాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర విద్యాశాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనే బ్లూ ఫిల్మ్స్‌ చూసే పార్టీ నుంచి ఇంతకుమించి ఏం ఆశించగలమంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సన్నీలియోన్ ఫొటో ముద్రించి ఉన్న హాల్ టికెట్‌ను షేర్ చేశారు.

కాగా కాంగ్రెస్ ఆరోపణలపై కర్ణాటక విద్యాశాఖ (Karnataka Education department) మంత్రి బీసీ నగేష్ కార్యాలయం స్పందించింది. ‘‘ అభ్యర్థే ఫొటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఏది అటాచ్ చేస్తే ఆ ఫొటోనే సిస్టమ్ తీసుకుంటుంది. సన్నీలియోన్ ఫొటో అప్‌లోడ్ చేశారా అని సంబంధిత అభ్యర్థిని వాకబు చేశాం. భర్త స్నేహితుడు ఒకరు తన వివరాలను అప్‌లోడ్ చేశాడని ఆమె చెప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఫొటో ఎవరో అప్‌లోడ్ చేశారో తేలాక ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం’’ అని కర్ణాటక ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

Updated Date - 2022-11-08T21:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising