ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CJI Chandrachud : అత్యున్నత న్యాయపీఠంపై జస్టిస్‌ చంద్రచూడ్‌

ABN, First Publish Date - 2022-11-10T05:41:02+05:30

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ధనంజయ్‌ యశ్వంత్‌ (డీవై) చంద్రచూడ్‌ ప్రమాణం చేశారు. బుధవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, కేంద్ర మంత్రుల హాజరు

కొత్త చీఫ్‌ జస్టిస్‌ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ

సాధారణ పౌరులకు సేవ చేయడమే కర్తవ్యం.. వారి రక్షణే ధ్యేయం

మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తా: సీజేఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబరు 9: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ధనంజయ్‌ యశ్వంత్‌ (డీవై) చంద్రచూడ్‌ ప్రమాణం చేశారు. బుధవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీస్వీకార ప్రమాణం చేయించారు. దైవసాక్షిగా, ఆంగ్లంలో ప్రమాణం చేసిన జస్టిస్‌ చంద్రచూడ్‌.. 2024 నవంబరు 10న పదవీవిరమణ చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రక్షణ, హోం, న్యాయ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, కిరణ్‌ రిజిజు, మాజీ సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌ తదితరులు హాజరయ్యారు. కొత్త చీఫ్‌ జస్టి్‌సకు ప్రధాని మోదీ ట్విటర్‌లో అభినందనలు తెలియజేశారు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలని ఆకాంక్షించారు. రిజిజు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు. సత్వర న్యాయం కోసం ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు.

పౌరుల రక్షణే ధ్యేయం: సీజేఐ

సాధారణ పౌరుడికి సేవ చేయడమే తన కర్తవ్యమని చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. పదవీ ప్రమాణం చేయగానే ఆయన సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. మాటలు కాదు.. చేతల్లో చూపిస్తానని చెప్పారు. ‘దేశ పౌరులందరి కోసం పనిచేస్తా. టెక్నాలజీ, రిజిస్ట్రీ, న్యాయ సంస్కరణల్లో పౌరుల రక్షణకే నా ప్రాధాన్యం. భారత న్యాయవ్యవస్థకు నేతృత్వం వహించడం మహత్తర అవకాశం.. బాధ్యత కూడా. మాటలతో గాక చేతల ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తా’ అని తెలిపారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 1959 నవంబరు 11న జన్మించారు. ఆయన తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు (వైవీ) చంద్రచూడ్‌ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దీర్ఘకాలం పనిచేయడం విశేషం. 1978 ఫిబ్రవరి 22 నుంచి 1985 జూలై 11 వరకు ఆయన చీఫ్‌ జస్టి్‌సగా వ్యవహరించారు. తండ్రీకుమారులిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.

చదువు-కెరీర్‌..

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తల్లి ప్రభ సంప్రదాయ సంగీత విద్వాంసురాలు. ఆయన 1979లో ఢిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆర్థిక శాస్త్రం, గణితంలో డిగ్రీ పూర్తిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1982లో బీఎల్‌ పట్టా పొందారు. ప్రతిష్ఠాత్మక ఇన్‌లాక్స్‌ స్కాలర్‌షి్‌పతో 1983లో హార్వర్డ్‌ లా స్కూల్‌లో మాస్టర్స్‌ ఆఫ్‌ లాస్‌ (ఎల్‌ఎల్‌ఎం) చేశారు. అక్కడే ఉండి 1986లో జ్యురిడికల్‌ సైన్స్‌లో డాక్టరేట్‌ (ఎస్‌జేడీ) సాధించారు. హార్వర్డ్‌లో జోసెఫ్‌ హెచ్‌. బియాలే ప్రైజ్‌ దక్కించుకున్నారు. అనంతరం భారత్‌కు తిరిగొచ్చి సుప్రీంకోర్టులో, బోంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1998లో భారత అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 2013 అక్టోబరు 31న అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నిరుడు ఏప్రిల్‌ 24 నుంచి కొలీజియం సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జాతీయ న్యాయసేవల అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్‌గా ఉన్నారు.

తండ్రి తీర్పుల కొట్టివేత

తన తండ్రి జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ ఇచ్చిన కొన్ని తీర్పులను కుమారుడు కొట్టివేయడం మరో విశేషం. వ్యభిచార చట్టానికి సంబంధించి సెక్షన్‌ 497ని తండ్రి సమర్థించగా.. కుమారుడు దానిని తోసిపుచ్చారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నాడు సమర్థించిన నలుగురు సుప్రీం న్యాయమూర్తుల్లో జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ కూడా ఒకరు. ఎమర్జెన్సీపై నిర్మించిన ‘కిస్సా కుర్సీకా’ సినిమాను నిషేధించిన కేసులో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీకి జైలు శిక్ష విధించిన ఘనత సాధించిన ఆయన.. ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులను రద్దు చేయడం సరైనదేనని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో పౌరుల ప్రాథమిక హక్కులన్నీ సస్పెండ్‌ అవుతాయని.. రక్షణ కోసం రాజ్యాంగ న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు వ్యక్తులకు ఉండదని పేర్కొన్నారు. 41 ఏళ్ల తర్వాత.. ఈ తీర్పును తప్పులతడకగా కుమారుడు అభివర్ణించారు. ‘జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ.. రాజ్యాంగమో, ప్రభుత్వమో ప్రసాదించినవి కావు. రాజ్యాంగం పుట్టకముందు నుంచే ఉన్నాయి. జీవించే హక్కు ప్రతి వ్యక్తికీ ఉంటుంది. దానిని ఎవరూ దూరం చేయలేరు’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తేల్చిచెప్పారు.

Updated Date - 2022-11-10T05:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising