Supreme Court: పెండింగ్ కేసులను ట్రాక్ చేసేందుకు మొబైల్ యాప్ 2.0
ABN, First Publish Date - 2022-12-07T17:17:11+05:30
సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0ను ప్రారంభించినట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0ను ప్రారంభించినట్టు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) తెలిపారు. సుప్రీంకోర్టు కార్యక్రమాలు బుధవారంనాడు ప్రారంభం కావడానికి ముందు సీజేఐ ఈ విషయం తెలియజేశారు. న్యాయ అధికారులు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ ఆఫీసర్లు తమ కేసులను ట్రాక్ చేసుకునేందుకు కొత్త ఫీచర్లతో రూపొందించిన ఈ యాప్ వీలు కల్పిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులు, స్టేటస్ ఆర్డర్లు, తీర్పులు, దాఖలు చేసిన ఏవైనా ఇతర పత్రాలను యాప్‌లోకి వెళ్లి పరిశీలించవచ్చని తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు. మరో వారం రోజుల్లో ఐఓఎస్ (iOS) వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కరోనా సమయంలో కోర్టు ప్రొసీడింగ్స్‌ను వర్చువల్ తరహాలో చూసేందుకు అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ.రమణ కొద్ది మంది మీడియా వ్యక్తులను అనుమతించారు.
Updated Date - 2022-12-07T17:22:18+05:30 IST